Home » Phone tapping
తనపై ఫిర్యాదు, ఆరోపణలు చేసిన శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. నేడు ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. భూదందాలు, కబ్జాలు చేస్తున్నారని బీజేపీ నుంచి శరణ్ చౌదరిని తొలగించినట్లు.. నకిలీ పత్రాలతో ప్రవాసుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు తెలిసిందన్నారు. శరణ్ చౌదరిపై ఎన్నో కేసులు ఉన్నాయని.. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించవద్దన్నారు
Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ (Phone Tapping) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కదిపే కొద్దీ డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయం బయటికొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా..
సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుపుతున్నా కొద్ది మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్నా కొద్దీ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఎస్‌ఐడీకి టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ ఈ కేసు విచారణలో కీలకంగా మారాడు. రవిపాల్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌లను తీసుకువచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.
Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో రోజుకో కీలక విషయం బయటికొస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే...
హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, హవాలా వ్యక్తుల ఫోన్లను ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ట్యాప్ చేసినట్లు పోలీస్ అధికారులు గుర్తించారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రణీత్ రావు(Praneeth Rao), భుజంగరావు(Bhujangarao), తిరుపతన్న(Tirupathanna) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. ఏడు రోజుల పాటు ప్రణీత రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ స్పీడందుకుంది. మాజీ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ న్యూస్ చానెల్ ఎండీ శ్రవణ్‌పై విచారణ అధికారులు దృష్టిసారించారు. వారిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. విదేశాల్లో ఉన్న వారిని స్వదేశం రప్పించేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని విచారణ అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. ప్రణీత రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆదివారం ఉదయం గాంధీ అస్పత్రికి తరలించారు.
అమరావతి: టీడీపీ నాయకుల ఫోన్ల టాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల కమిషన్‌కు లేక ద్వారా ఫిర్యాదు చేశారు. ఇంటిలిజెన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఈవోని కోరారు.