Home » Phone tapping
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది. అలాగే భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ విచారించనుంది. ఇప్పటికే పోలీసులు ఒకసారి చార్జిషీట్ దాఖలుచేశారు. దీంతో నిందితుల బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారించనుంది.
పోలీసు శాఖ గాడితప్పుతోందా? శాంతిభద్రతలపై పట్టు కోల్పోతోందా? ఒక్క ఫోన్‌తో న్యాయం జరుగుతుందనే పేరున్న డయల్-100 ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే చెబుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ..
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటుపరం చేస్తుందని ఎన్నికల్లో ఓట్ల కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేశారని, అదంతా ఆయన ఆడిన డ్రామా అని మండిపడ్డారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్ఐబీకి టెక్నాలజీ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్‌లో హార్డ్ డిస్క్‌లు సీజ్ చేశారు. మూడు సర్వర్లు, ఐదు మినీ డివైసెస్తో పాటు హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికన్ నుంచి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను చార్జ్‌షీట్‌లో వివరించారు. మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదవ్వగా.. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో నలుగురిని-- టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆరుగురిని నిందితులుగా చేర్చారు. కాగా మార్చి 10న ఎఫ్ఐర్ నమోదు చేసిన పోలీసులు మొత్తం ఆరుగురిపై అభియోగాలు మోపారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) పొట్లపల్లి రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి సరోజినీ దేవి (98) సోమవారం మృతిచెందడంతో ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని రాధాకిషన్‌రావు సోమవారం కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని ఓ నిందితుడు (ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు) తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.