Share News

Phone Tapping Case: సుప్రీంను ఆశ్రయించిన తిరుపతన్న

ABN , Publish Date - Oct 24 , 2024 | 03:11 PM

Telangana: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం సుప్రీంలో బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.

Phone Tapping Case: సుప్రీంను ఆశ్రయించిన తిరుపతన్న
Phone Tapping Case

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో పోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారికి ప్రతీసారీ నిరాశే మిగులుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారి సుప్రీం కోర్టును (Supreme Court) ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ తెలంగాణ పోలీసు అధికారి తిరుపతన్న ఉన్నతన్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

Viral News: గోవులను తొక్కించుకునే సంప్రదాయం.. ఈ ఊరు ప్రత్యేకత తెలుసా



ఫోన్‌ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. తిరపతన్నకు బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తిరుపతన్న పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి మూడు నెలలు అయిన తర్వాత కూడా హైకోర్టు బెయిల్ ఎందుకు నిరాకరించిందని ధర్మాసనం ప్రశ్నించింది. తరుపరి విచారణను వచ్చే నెల 27కు ధర్మాసనం వాయిదా వేసింది.

Jagan: తనకు తానే ప్రతిపక్ష హోదా ఇచ్చుకున్న జగన్‌..


కాగా.. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు ఇటీవల హైకోర్టు బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం నిరాకరించింది. తిరుపతన్న ఫోన్‌ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇస్తే... దాన్ని వల్ల దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. పోలీసుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక ప్రకారం దర్యాప్తు చేయాలని ఖాకీలను కోర్టు ఆదేశించింది. అలాగే తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేస్తూ.. ఈ కేసును హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ తిరుపతన్న సుప్రీంను ఆశ్రయించారు. మరి తిరుపతన్న బెయిల్ వస్తుందా.. లేదా తెలియాలంటే తదుపరి విచారణ వరకు వేచి చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి..

Jeevan Reddy: ఏఐసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన లేఖ..

Tammineni: కాంగ్రెస్‌ పార్టీపై తమ్మినేని సెన్సేషనల్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 03:16 PM