Buddha Venkanna:మాపై దాడి అలా జరిగింది.. బుద్దావెంకన్న షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jan 14 , 2025 | 02:00 PM
Buddha Venkanna: మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.తురక కిషోర్ తమపై దాడి చేసి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్‌లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు.
పల్నాడు జిల్లా: వైసీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్‌లు వేయకుండా గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని బుద్దా వెంకన్న అన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును మాజీ ఎమ్మెల్సీ బుద్ధవెంకన్నఇవాళ(మంగళవారం) కలిశారు. మాచర్లలో తమపై జరిగిన హత్య ప్రయత్నం కేసుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. తెలుగుదేశం అభ్యర్థులకు అండగా మాచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలసి మాచర్ల వెళ్లానని చెప్పారు.
మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. తురక కిషోర్ తమపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో పిన్నెల్లి సోదరులు, తురక కిషోర్‌లు ఎన్నో దారుణాలు చేశారని విమర్శించారు. తమపై దాడి చేసింది తురక కిషోర్, చేయించింది పిన్నెల్లి సోదరులని ఆక్షేపించారు. తురకా కిషోర్ కేసులో పిన్నెల్లి సోదరులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని బుద్దా వెంకన్న అన్నారు.