Home » Politicians
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
రాజకీయ పార్టీలు, నేతల ఉపన్యాసాల్లో ఉపయోగించే భాషపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపే పదాలను సాధ్యమైనంత వరకూ ఉపయోగించకుండా ఉండాలని స్పష్టం చేసింది. మూగ, పాగల్, సిర్ఫిరా, అంధ, గుడ్డి, చెవిటి, కుంటి వంటి పదాలను నేతలు వాడకుండా ఉండాలని ఈసీ సూచించింది. రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి పదాలు నిషేధించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది.
రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ చెందరని అంటారు. రాజస్థాన్‌లోని దంతారామ్‌గఢ్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ భార్యాభర్తలు తలపడుతుండటమే అందుకు ప్రధాన కారణం.
చేపల పేరు మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ కోట్ల రూపాయలు సంపాదించారు. షర్మిల డెడ్ లైన్ ఏం లేదు. కాంగ్రెస్‌కి డెడ్ లైన్లు పెడతారా?
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్ర పర్యటన ఆ పార్టీ సీనియర్ నేతల్లో పలువురిని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.
అవును.. మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే అడిగారు. కొంపదీసి ఇటీవల రచ్చ రచ్చ జరుగుతున్నా ‘వలంటీర్ వ్యవస్థ’పై వెనక్కితగ్గి క్షమాపణలు చెప్పారనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్. ఇంతకీ సేనాని ఎందుకు క్షమాపణలు చెప్పారబ్బా అనేగా మీ సందేహం..? ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ వార్త చదివేయండి అసలు విషయమేంటో మీకే అర్థమైపోతుంది..
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత శరద్ పవార్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చారు.బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ గ్రూపు నేతలపై వేటు వేశారు. అంతేకాదు.. 2024 అసెంబ్లీ ఎన్నికలపై శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు.
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీల ఐక్యత సమావేశం మరికొద్దిసేపట్లో బీహార్ సీఎం నితీష్‌కుమార్ నివాసంలో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 15 ప్రతి పక్ష పార్టీలు పాల్గొననున్నాయి.
ప్రతి నియోజకవర్గం సిద్దిపేటలా మారినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం. సిద్దిపేట ఐటీ హబ్‌ను మరింత విస్తరిస్తాం..
బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైనట్టేనా?.ఈటెల రాజేందర్‌తో చర్చల అనంతరం నిర్ణయానికి వచ్చారా?. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరికపై ప్రకటన ఉంటుందా? అనే సందేహాలకు తావిచ్చేలా జూపల్లి, పొంగులేటి కేంద్రంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.