Home » Politicians
అక్రమంగా తనను అరెస్టు చేయడమేకాకుండా జైలులో వేధిస్తున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో పాల్గొనకుండా ఉండేందుకే తనను అరెస్టు చేశారని తెలిపారు. గురువారం పాక్ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆయన కేసుపై విచారణ జరిపింది.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందున బీజేపీ సీనియర్ నేతలు సోమవారం భేటీ అయ్యారు. పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ 421 సార్లకు పైగా ‘మందిరం-మసీదు’, దేశాన్ని విడదీసే విభజనవాద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
ప్రతి 5 సంవత్సరాలకొకసారి జరిగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఏడీఆర్ తన నివేదికలో వెల్లడించింది. 2009 నుండి 2024 వరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య 104 శాతం పెరిగిందని పోల్ రైట్స్ బాడీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) విశ్లేషించింది.
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమేనని, నాలుగు కోట్ల మంది గుండెలను గాయపరచడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
‘‘మమ్మల్ని ద్వేషించేవాళ్లు ఆ కొందరినే ఎందుకు ఇష్టపడతారు!? అక్కడి (పాకిస్థాన్) నుంచి వారికే ఎందుకు మద్దతు లభిస్తుంది!? ఈ అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలి’’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందంటున్నారని... మరి ప్రజల జీవితాల్లో మార్పెందుకు రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బీజేపీ నేతలను ప్రశ్నించారు.
సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో బిహార్‌లోని 8 కీలక పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 86 మంది పోటీలో ఉన్నారు.
ఓట్ల శాతంపై తుది డేటాను వెంటనే వెల్లడించాల్సిందిగా ఎన్నికల కమిషన్(ఈసీ)ను ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరో వారం రోజుల్లో ఎన్నికలు ముగుస్తాయని, ఈ మధ్యలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్‌చంద్రతో కూడిన వెకేషన్ బెంచ్ శుక్రవారం స్పష్టంచేసింది.