Home » Ponguleti Srinivasa Reddy
జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మాజీ సీజేఐ ఎన్వీ రమణ గొప్ప నిర్ణయం వెలువరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.
ఖమ్మం జిల్లాలో గత వారం రోజుల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానలు దంచికొడుతుండటంతో ఖమ్మం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరద కాలనీలను నీరు ముంచెత్తడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.
ఒకటి కాదు రెండు కాదు పదిరోజులుగా ఖమ్మం ప్రజలను మున్నేరు (Munneru) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నిరోజులు బిక్కుబిక్కుమంటూ బతికిన ఖమ్మం వాసులు (Khammam) ఇక ఊపిరి పీల్చుకోవచ్చు. మున్నేరు కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక్క అడుగు తగ్గి 15 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శనివారం అర్దరాత్రి వరకూ మున్నేరు వేగంగా పెరిగిన సంగతి తెలిసిందే.
వరద బాధితుల సహాయార్ధం అపోలో ఆస్పత్రుల యాజమాన్యం తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది.
ఓ మాజీమంత్రి కాల్వలను కబ్జా చేయడం వల్లే ఖమ్మం జిల్లాకు పెనుముప్పు వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి, రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది...
ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్‌పై పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలుకు గాయమైంది.
జిల్లాలో ఎప్పుడో 85 ఏళ్ల క్రితం మున్నేరు వద్ద 35అడుగుల మేర ప్రవహించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మళ్లీ ఇప్పుడు 35అడుగులు మున్నేరు నీటి మట్టం దాటిందని చెప్పారు. మున్నేరు ప్రళయం దాటికి వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.