Home » Ponguleti Srinivasa Reddy
Telangana: జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాస ధ్యాన మందిర ఆడిటోరియాన్ని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. భక్తరామదాసు ఇక్కడే జన్మించారని.. ఆయన జన్మస్థలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు.
సృజనాత్మకతతో తీసే ఫొటో పాఠకుల్ని ఆలోచింపజేస్తుందని, వార్తా చిత్రాలకు ప్రజలను ప్రభావితం చేస్తూ భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నా రు.
గత ప్రభుత్వ హయాంలో ఓ పెద్దమనిషి, ఓ ఉన్నతాధికారి కలిసి కుట్ర పూరితంగా రాత్రికి రాత్రే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రే తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు భూమి చిక్కులు లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం-2024 తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
‘ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు హాజరై ఫ్యూచర్ సిటీపై చర్చించారు.
‘రుణ మాఫీతో తెలంగాణలో రైతులు రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం జిల్లా గడ్డపై నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపుతామని మేం చెబితే..
సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. 2050 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు.
పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, అందు కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలలను ప్రపంచ పటంలో ఉంచాలని, వాటిని ప్రాచుర్యంలోకి టీసుకొచ్చి బుద్దిస్ట్‌లను ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.