Home » Rahul Gandhi
అమెరికా అధ్యక్షుడు బైడెన్ లాగే ప్రధాని మోదీ కూడా జ్ఞాపకశక్తి కోల్పోయారని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపైనే ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మహారాష్ట్రలో ఇటీవల శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరే బ్యాగులను ఈసీ అధికారులు పదేపదే తనిఖీ చేయడం, ఇందుకు సబంధించిన వీడియోను థాకరే విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ప్రధానమంత్రి, బీజేపీ నేతలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు చేస్తారా అని థాకరే నిలదీశారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ ప్రచారంలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. రాహుల్‌గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు అనుమతులు ఇవ్వడంలో 45 నిమిషాలపాటు ఆలస్యం జరిగింది.
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ హస్తం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణం జరక్కుండా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి నిలిపేసిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఔరంగజేబ్ కూల్చేసిన కాశీ విశ్వనాథ ఆలయానికి కారిడార్ నిర్మించడం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్లో స్వర్ణ సోమనాథ ఆలయాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.
తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దేశ వ్యతిరేకులు సమాజ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారి ఉద్దేశాల తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
‘‘మోదీ జీ తెలంగాణలో శనివారం కులగణన మొదలైంది. కులగణన లెక్కల ఆధారంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి విధానాలను రూపొందిస్తాం.
దేశంలో ప్రజల్ని మత ప్రాతిపదికన చీల్చాలని మోదీ ప్రయత్నిసున్నారని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మణిపూర్ తగలబడటానికి అదే కారణమని ఆరోపించారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లోహర్గడా, సిండెగాలలో చేపట్టిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యాంగంపై బీజేపీ నిరంతర దాడి చేస్తోందని, అయితే ఇండియా-కూటమి నిరంతరం రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తోందని చెప్పారు. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని తొలగించేందుకు తామ (కాంగ్రెస్) కట్టుబడి ఉంటామని రాహుల్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు.