Home » Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు గురువారం రూ.35 లక్షల విరాళం అందజేసి మంచి మనసు చాటుకున్నారు.
రాష్ట్రంలో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే ప్రతీ వంద డెలివరీల్లో 75 సిజేరియన్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో 46.4 శాతం కడుపుకోతలే ఉండటం గమనార్హం.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా కేసీఆర్‌కి మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది.
ఓట్లు కోసం శ్రీరాముడి పేరు వాడుకోవడం లేదని కరీంనగర్ ఎంపీ ఒండి సంజయ్ స్పష్టం చేశారు. భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్ వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని ఆయన అభివర్ణించారు. ఆదివారం రాజన్న సిరిసిల్లలో పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం బీజేపీ పోరాడితే.. కాంగ్రెస్ వాళ్లకు ఓటు వేస్తారా ? అని ప్రశ్నించారు.
వేములవాడ రాజన్న సన్నిధిలో నేడు శ్రీ సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న క్షేత్రంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది.
రాజన్నసిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేసి.. లఘు దర్శనానికి అనుమతిచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
వివాహేతర సంబంధంతో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.