Home » Revanth Reddy
ప్రస్తుతం ఐటీఐల్లో విద్యార్థులకు నేర్పించే నైపుణ్యాలు ఉపయోగం లేకుండా పోయాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. 50 ఏళ్ల నాటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని, అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించారు. ఇందుకోసం టాటా సంస్థ సహకారం తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులు, నిరుద్యోగులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు గల అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చి వేశారు. అవి అక్రమ నిర్మాణాలు అని చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే ఆదేశాలతో కూల్చివేత ప్రక్రియ జరిగింది. వాస్తవానికి హేమంత్‌కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. తెలంగాణకు చెందిన ఓ మంత్రి స్వయంగా హేమంత్‌కు ఆదేశాలు ఇచ్చారని విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహజ్యోతి పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే ఛార్జీ వేయరు. లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందు చాలా మంది ప్రజాపాలన దరఖాస్తు చేశారు. కొందరికి మాత్రం గృహజ్యోతి పథకం అమలు కాలేదు. అలాంటి వారు అప్లై చేసుకునే అవకాశం ఇస్తోంది.
Ramoji Rao Passed Away: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో..
ఢిల్లీ అశోక హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మళ్లీ ప్రారంభమైంది. సమావేశంలో మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, గౌరవ గొగోయ్ సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. సీడబ్ల్యుసీ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహా, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, డీకే శివకుమార్, హిమాచల్ సీఎం సుక్విందర్ సింగ్ సుకు, ఏపీ నుంచి రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ(telangana)లో కొత్తగా ఎంపికైన కాంగ్రెస్ ఎంపీలకు(congress mps) శుభవార్త వచ్చేసింది. అది ఏంటంటే రేపు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఫ్యాన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నా అందులో ఒక వ్యక్తి ప్రధాన కారణమని ప్యాన్ పార్టీ కేడర్‌లో ఓ అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు...
తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్లు అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది.