Home » Salman Khan
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) పాదాలను ఆయన భార్య సాక్షి సింగ్(Sakshi Singh) మొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో సాక్షి తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో పోస్ట్ చేయగా.. వీడియోకు కొన్ని గంటల్లోనే 30 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.
Salman Khan - Bishnoi gang: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ని హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నవీ ముంబై పోలీసులు తాజాగా చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ పన్నిన కుట్రలను క్లియర్‌గా వివరించారు. సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్..
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌పై జరిగిన దాడి కేసులో తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సల్మాన్ కారుపై ఏకే-47 తుపాకులతో దాడి చేసేందుకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద ఇటీవలే కాల్పులకు పాల్పడిన ఘటనలో పలువురిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద కాల్పులకు సంబంధించిన కేసులో నిందితుడు అంజు తపన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం పోలీస్ కస్టడీలో అతడు ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు.. అతడిని వెంటనే సెయింట్ జార్జి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల ఘటనలో ఇద్దరు షూటర్లు ఉపయోగించిన ఆయుధాలను, తూటాలను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని తపతీ నదిలో వీటిని కనుగొని, వెలికి తీసినట్టు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అవ్వగా.. తాజాగా కేసులో మరో కొత్త మలుపు వెలుగు చూసింది. బుధవారం రాత్రి హర్యానాలో..
రాష్ట్రంలో సంచరించే గ్యాంగ్‌లు, గూండాలను కూకటి వేళ్లలో ఏరివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కాల్పుల ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను సీఎం మంగళవారంనాడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు తగు భద్రత కల్పిస్తుందని, కాల్పుల ఘటనలో ఎవరి హస్తం ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని ధైర్యం చెప్పారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టయిన ఇద్దరు నిందితులను ఈనెల 25 వరకూ పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని ముంబై కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది. కాల్పుల ఘటన వెనుక కుట్ర వివరాలు, ప్రధాన సూత్రధారి ఎవరనేది తెలుసుకునేందుకు నిందితులను 14రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును క్రైం బ్రాంచ్ కోరింది.
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు(police) గుర్తించినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తి అని పోలీసులు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న యువకుడు విశాల్ రాహుల్ అలియాస్(కాలూ) అని పోలీసులు చెబుతున్నారు. కానీ కాల్పుల రోజున ఓ పోలీస్ వాహనం మిస్సైన విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.