Home » Shivraj Singh Chouhan
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలందించిన శివరాజ్ సింగ్ చౌహాన్ చిక్కుల్లో పడ్డారా? సొంత పార్టీనే ఆయనకు ముకుతాడు వేయాలనుకుంటోందా? బీజేపీ సోమవారంనాడు విడుదల చేసిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితాలో శివరాజ్ సింగ్ నియోజకవర్గాన్ని పార్టీ అధిష్ఠానం ప్రకటించ లేదు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ నిప్పులు చెరిగారు. ఆయనో డమ్మీ ముఖ్యమంత్రి అని, పచ్చి అబద్ధాల కోరు అంటూ ధ్వజమెత్తారు. అందుకే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో...
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళలకు ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 30 శాతం రిజర్వేషన్‌ను 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు.
మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా ముగ్గురికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. భోపాల్‌లోని రాజ్‌భవన్‌లో శనివారంనాడు ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రులలో రాజేంద్ర శుక్లా, గౌరీశంకర్ బైసెన్, రాహుల్ సింగ్ లోథి ఉన్నారు.
మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం మన దేశంలో అత్యుత్తమ స్మార్ట్ సిటీగా, ఆ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా ఎంపికయ్యాయి. అత్యుత్తమ నగరాల్లో రెండో స్థానంలో సూరత్, మూడో స్థానంలో ఆగ్రా నిలిచాయి. అత్యుత్తమ రాష్ట్రాల్లో రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో రాజస్థాన్ నిలిచాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య ప్రదేశ్ శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలు సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచారు. 2003 నుంచి 2023 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన బీజేపీ ప్రభుత్వాలు వెనుకబడిన రాష్ట్రమనే నానుడిని తొలగించడంలో విజయం సాధించినట్లు తెలిపారు.
మధ్యప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. అక్కడ రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ మాటలకు పదును పెట్టారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడంతో...
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాల నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలు 50 శాతం కమిషన్ కోసం కాంట్రాక్టర్లను వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో కన్వర్ యాత్రలో పాల్గొన్న మహాశివుని భక్తులపై కొందరు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కహర్వాడీ ప్రాంతంలో సోమవారం ఈ దారుణం జరిగింది. నగరంలోని ప్రధాన మార్గాల్లో ఈ యాత్ర సజావుగానే సాగింది.
మానవత్వం మరచిన దుర్మార్గులకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. పన్నెండేళ్ల బాలికపై అత్యంత అమానుషంగా, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప ఊచను దింపిన ఇద్దరు నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేసింది. అంతేకాకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది.