Ujjain: నిందితుడికి ఉరి శిక్ష వేయాలి.. ఉజ్జయిని ఘటన నిందితుడి తండ్రి డిమాండ్

ABN , First Publish Date - 2023-09-30T14:51:29+05:30 IST

మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని ఉజ్జయిని(Ujjain)లో లైంగికదాడికి గురైన పదిహేనేళ్ల బాలిక ఘటన యావత్తు దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. వీధుల్లో తిరుగుతున్న ఆమెకు కనీసం సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దేశాన్ని నివ్వేరపరిచింది. ఆమెపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్(Auto Driver) భరత్ సోనీనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి తండ్రి తన కొడుకును ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

Ujjain: నిందితుడికి ఉరి శిక్ష వేయాలి.. ఉజ్జయిని ఘటన నిందితుడి తండ్రి డిమాండ్

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్‌(Madyapradesh)లోని ఉజ్జయిని(Ujjain)లో లైంగికదాడికి గురైన పదిహేనేళ్ల బాలిక ఘటన యావత్తు దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. వీధుల్లో తిరుగుతున్న ఆమెకు కనీసం సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం దేశాన్ని నివ్వేరపరిచింది. ఆమెపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్(Auto Driver) భరత్ సోనీనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి తండ్రి రాజు సోని స్పందిస్తూ.. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నేరాలు చేసేవారిని కఠినంగా శిక్షించాలని లేదంటే ఆడపిల్లలకు రక్షణ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఘటనతో తాము మానసికంగా కుంగి పోయామని బయటకి రావాలంటే సిగ్గుగా ఉందని వాపోయారు. అలాంటి నేరాలు చేసేవారికి భూమిపై జీవించే హక్కులేదని.. నేరానికి పాల్పడే ఎవరినైనా కాల్చివేయాలి లేదా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు తనకు కుమార్తె లాంటిదని ఆమెకు న్యాయం చేయాలని అన్నారు.


కేసులు నమోదు...

దేశవ్యాప్తంగా కలకలం రేపిన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని బాలిక అత్యాచార ఘటనలో బాలికకు సహాయం చేసేందుకు నిరాకరించిన వారిపైనా కేసులు పెడుతున్నట్లు రాష్ట్ర పోలీసులు శుక్రవారం స్పష్టం చేశారు. ఆమెకు సహాయం చేయకపోవడమే కాక, ఆమెపై జరిగిన అఘాయిత్యం గురించి తమకు సమాచారం అందించని వారందరిపైనా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉజ్జయిని అడిషనల్‌ ఎస్పీ జయంత్‌సింగ్‌ రాథోర్‌ వెల్లడించారు. ‘‘ఇప్పటికే ఒక ఆటో డ్రైవర్‌ను గుర్తించి చర్యలు తీసుకున్నాం. మరింతమందిని గుర్తించే పనిలో ఉన్నాం’’ అని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా.. బాధితురాలిని తన కూతురిగా, మధ్యప్రదేశ్‌కు కూతురిగా రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అభివర్ణించారు. ఆమెను అన్నిరకాలుగా ఆదుకోవడమే కాక, నిందితులకు అత్యంత కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన ప్రకటించారు.

Updated Date - 2023-09-30T16:33:26+05:30 IST