Home » Sonia Gandhi
ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కేసీఆర్ ఈ మేరకు బడ్జెట్‌ను ఏనాడైనా కేటాయించారా అంటూ నిలదీశారు.
ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో కొన్ని పథకాలకు తాజా బడ్జెట్లో నిధులను కేటాయించలేదు. దాంతో ఈ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.
సోనియా, రాహుల్, ఖర్గేల నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యుత్తమంగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
గాంధీ, బచ్చన్ కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఒకరికొరు తారస పడితే అక్కడ సహజంగానే ఒకింత ఆసక్తికర వాతవారణం నెలకొంటుంది. అలాంటి అరుదైన ఘటనే బుధవారంనాడు పార్లమెంటు ఆవరణలో చేటుచేసుకుంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ ఒకరికొకరు ఎదురుపడి ఆప్యాయంగా పలకరించుకున్నారు.
బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని రూపొందించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం (జులై 22) కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని ఆ పార్టీ తెలిపింది. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.
గురువారం సాయంత్రం 4 గంటల నుంచి.. సోనియా, రాహుల్ డైరెక్షన్లో.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం.. రూ. 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు.
లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు ఆ పార్టీ మరోసారి అవకాశమిచ్చింది. చీఫ్ విప్‌గా సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్, విప్‌లుగా మాణిక్కం ఠాగూర్, మహమ్మద్ జావేద్‌లను నియమించింది.
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతినాడు ఇడుపులపాయలోని ఆయన సమాధి సాక్షిగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్నారు. ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరు కానున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y.S.Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐసీసీ సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు(Rudra Raju), రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి(Mastan Vali) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపధంలో నడిపారని రుద్రరాజు గుర్తు చేశారు.