Home » Srisailam
శ్రీశైలం ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంది. సోమవారం ఈ ప్రాజెక్టుకు 1,20,848 క్యూసెక్కుల వరద రాగా... జలవిద్యుదుత్పత్తి, పోతిరెడ్డిపాడు ద్వారా తరలింపునకు 77,624 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు.
నంద్యాల: శ్రీశైలం మల్లన్న ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీతో శ్రీశైలం క్షేత్రం సందడిగా మారింది.
సుండిపెంట గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు.
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు తొమ్మిదవరోజుకు చేరుకున్నాయి. మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సిద్ధిదాయిని అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు.
శ్రీశైలం క్షేత్రంలోని వీరభద్రస్వామికి మంగళ వారం శ్రీశైలం కొత్త పేటకు చెందిన డి.పుల్లయ్య వీరభద్ర స్వామికి వెండికిరీటం, వెండిపళ్లెం సమర్పిం చారు.
కృష్ణా బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్లు) కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)లో అనుమతుల కోసం దాఖలు చేసి, ట్రైబ్యునల్లో ఆయా ప్రాజెక్టుల నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 25 గేట్లను ఎత్తి 80,240 క్యూసెక్కులను జూరాలకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్య కళారాధన కార్యక్రమంలో శనివారం చెన్నైకి చెందిన మైత్రీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ బృందంతో సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఆలయాల్లో భక్తుల సమస్యలు పట్టించుకోవడం పక్కనపెట్టి.. సొంత జేబులను నింపుకోవడానికే వైసీపీ నేతలు, ఆ పార్టీకి వంతపాడుతున్న అధికారులు ఐదేళ్లు పనిచేసినట్లు తెలుస్తోంది. తిరుపతి లడ్డూ వివాదం బయటకు రావడంతో.. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి..
విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.