Share News

Brahmotsavalu: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Feb 19 , 2025 | 07:11 AM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం సిద్ధమైంది. శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Brahmotsavalu: శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Srisailam Maha Shivaratri Brahmotsavalu

నంద్యాల: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల (Srisailam) భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం (Bhramaramba Mallikarjuna Swamy Temple) మహా శివరాత్రి (Maha Shivaratri) బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉత్సవాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈనెల 23న మల్లికార్జున స్వామికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరాలు సమర్పించనున్నారు. 25న కీలక ఘట్టం... పాగాలంకరణ జరుగుతుంది.

ఈ వార్త కూడా చదవండి..

బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..


అన్ని ఆర్జిత సేవలను రద్దు..

బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని ఆర్జిత సేవలను నిలుపుదల చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో బుధవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రముఖులకు 4 విడతలుగా బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు, పాదయాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాగా, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును దేవదాయశాఖ అధికారులు ఆహ్వానించారు. మంగళవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్‌ రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, వేదపండితులు ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకుని ఆయనకు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రిక అందించారు.


ఏపీ టూరిజం గుడ్ న్యూస్

మహాశివరాత్రి సందర్బంగా ఆ పరమేశ్వరుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో శైవక్షేత్రాలకు భక్తులు క్యూ కడతారు. ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి జనం తండోపతండాలుగా తరలివస్తారు. శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అక్కడ ఘనంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఏపీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుండి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాజమండ్రి నుండి ప్రత్యేక టూరిజం బస్సులు బయలుదేరనున్నాయి. మూడు రోజులపాటు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో శ్రీశైలం యాత్ర కొనసాగతుంది. టూరిస్టులను తీసుకువెళ్లే ప్రదేశాలు ఏంటంటే.. శక్తిపీఠం శ్రీశైలం భ్రమరాంబ టెంపుల్, శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, త్రిపురాంతకేశ్వరి స్వామి టెంపుల్, బాలా త్రిపుర సుందరి దేవి టెంపుల్. మహాశివరాత్రి సందర్భంగా అక్కడికి వెళ్లాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

అడ్డుగా వచ్చిన ఎలుగుబంటిని తప్పించబోయి..

పారాణి ఆరనే లేదు...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 19 , 2025 | 07:11 AM