Home » TANA
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), కార్యసిద్థి హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో "బ్రహ్మశ్రీ డా. గంగాధర శాస్త్రి ‘గీతా గాన ప్రవచనం" కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. కార్యసిద్థి హనుమాన్ ఆలయంలో భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటున్న పిల్లలు కొన్ని శ్లోకాలను ఆలపించి, అందరిని ఆకట్టుకున్నారు. పిల్లలకు చక్కగా భగవద్గీత నేర్పించడానికి ప్రోత్సహిస్తున్న తలిదండ్రులను, నేర్పిస్తున్న గురువులను గంగాధర శాస్త్రి గారు వారి దీవెనలతో అభినందించారు.
2021-23 రెండేళ్ల పాటు తానా అధ్యక్షుడిగా పని చేసిన అంజయ్య చౌదరి లావు తాజాగా పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా తన రెండేళ్ల పదవి కాలానికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
టీడీపీ జోన్-2 కోఆర్డినేటర్‌గా రవి మందలపు ఎన్నికయ్యారు.
అగ్రరాజ్యం అమెరికాతో తెలుగు రాష్ట్రాలకు ఉన్న అనుబంధం బహుశా ప్రపంచ దేశాల్లోని ఏ రాష్ట్రానికీ ఉండదేమో.. అక్కడ తెలుగువారు లేని వీధులుండవు.. తెలుగువారు కనిపించని కార్యాలయాలుండవు..
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నూతన అధ్యక్షునిగా నిరంజన్ శృంగవరపు పదవీ బాధ్యతలు చేపట్టారు.
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ట్రెజరర్‌గా కృష్ణాజిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఎన్నికయ్యారు.
ఉత్తర అమెరికాలోని, ఫిలడెల్ఫియా నగరం పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జులై 7,8,9వ తేదీలలో తానా 23వ మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయి.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ గురించి తానా సభలో మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘తెలంగాణలో 95 శాతం రైతులు మూడెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఒక ఎకరాకు నీళ్లు పారించాలంటే ఒక గంట చాలు. మూడెకరాల్లో వ్యవసాయం చేసే రైతుకు మూడు గంటల పాటు విద్యుత్ అందుబాటులో ఉంటే చాలు. టోటల్‌గా 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతది’ అని రేవంత్ చేసిన కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ రాజకీయం మొదలైంది.
ఉత్తర అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరం పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జులై 7,8,9వ తేదీలలో 'తానా' 23వ మహాసభలు (23rd TANA Conference) అంగరంగ వైభవంగా జరిగాయి.
సైకో తరహా విధ్వంసంపై మాజీ సీజేఐ ఎన్వీరమణ చురకలంటించారు. తానా సభలో ఎన్వీరమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సైకో తరహా విధ్వంసంపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మానసిక స్థిమితం లేని వారే(సైకోలు) జాత్యహంకారపు , కులాహంకారపు ఆలోచనలు చేస్తారని... వ్యాప్తిలోకి తెస్తారని అన్నారు. సైకోలే విచ్ఛిన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారన్నారు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటారని దుయ్యబట్టారు.