LeT: రంజాన్ పండుగ రోజే లష్కరే తోయిబా అగ్రశ్రేణి ఫైనాన్షియర్ హత్య
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:17 PM
ఇవాళ హత్యకు గురైన రెహ్మాన్.. 'లష్కరే తోయిబా' ఉగ్రవాద సంస్థకు ప్రముఖ ఫైనాన్షియర్. వివిధ దేశాలనుంచి డబ్బులు కలెక్ట్ చేసి హై కమాండ్‌కు పంపడమే రెహ్మాన్ ప్రధాన పని.

పాకిస్తాన్లో కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ సన్నిహిత టెర్రరిస్టులు ఒక్కక్కరుగా లేచిపోతున్నారు. పాకిస్తాన్‌లో వీళ్లని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు.ఇటీవలే హఫీజ్ సన్నిహితుడైన ఖతల్ తుపాకీ గుళ్లకి చినిపోగా, ముస్లింల పెద్ద పండుగ రంజాన్ పర్వదిన వేళ మరో టెర్రరిస్త్ అబ్దుల్ రెహ్మాన్ కూడా గన్ షాట్స్‌కి చచ్చిపోయాడు. ఈ దాడి మొత్తం సీసీటీవీల్లో రికార్డ్ అయింది. ఇక, ఇవాళ చనిపోయిన రెహ్మాన్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ప్రముఖ ఫైనాన్షియర్. ఆ ఉగ్ర సంస్థకు వివిధ దేశాల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి హై కమాండ్‌కు సొమ్ములు పంపడమే రెహ్మాన్ ప్రధాన బాధ్యత. దీంతో ఇతన్ని అనేక దేశాలు ఉగ్రవాదిగా గుర్తించాయి.
'ఈద్-ఉల్-ఫితర్' రోజున, లష్కరే తోయిబా (LeT) అగ్రశ్రేణి ఫైనాన్షియర్ అయిన రెహ్మాన్ మరణవార్త లక్షరే తోయిబాను కలవరపాటుకు గురిచేసే అంశం. పాకిస్తాన్‌లోని కరాచీలో గుర్తు తెలియని వ్యక్తులు రెహమాన్‌ను కాల్చి చంపారు. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఒక దుకాణంలో నిలబడి ఉన్న రెహమాన్‌పై కాల్పులు జరిపారు. ఇవాళ పట్టపగలు ఈ హత్య జరిగింది. కాల్చి చంపి అక్కడి నుండి పారిపోతున్న దుండగుల కదలికలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
కాగా, ప్రస్తుతం కరాచీలో ఒక బిగ్ డాన్‌గా తన ప్రాభవాన్నిచూపుతున్న రెహ్మాన్ గతంలో పాకిస్తాన్, భారతదేశంలో జరిగిన వివిధ ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడు. ఎల్‌ఇటి నిధుల సేకరణ కార్యకలాపాలకు కేంద్ర స్థానం ఇతనే. వివిధ ప్రాంతాల నుండి నిధుల సేకరణదారులు తాము సేకరించిన మొత్తాలను రెహ్మాన్‌కు తీసుకువచ్చేవారని, వాటిని అతను గ్రూప్ ఉన్నతాధికారులకు చేరవేస్తాడని నివేదికలు చెబుతున్నాయి. రహ్మాన్ లోతైన సంబంధాలు, నిధుల నిర్వహణలో కీలక పాత్ర, అతన్ని లష్కరే తోయిబాలో కీలకమైన వ్యక్తిగా మార్చాయని నివేదికలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, మార్చి 16న పాకిస్తాన్‌లో హఫీజ్ సయీద్ మరో సన్నిహితుడైన అబూ ఖతల్‌ని చంపేశారు. ఖతల్ సింధీ అని కూడా పిలువబడే ఖతల్.. 2017 రియాసి బాంబు పేలుడు, జమ్మూ కాశ్మీర్‌లో యాత్రికులతో వెళుతున్న బస్సుపై 2023లో జరిగిన దాడితో సహా అనేక ఉన్నత స్థాయి దాడులలో పాల్గొన్నాడు. ఖతల్ హత్య కూడా పాకిస్తాన్‌లోనే జరిగింది. తన వాహనంలో ప్రయాణిస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఖతల్‌ని కాల్చి చంపారు. రెహ్మాన్ మరణంతో అతని కదలికల్ని చాలా సంవత్సరాలుగా ట్రాక్ చేస్తున్న భారత ఏజెన్సీల సుదీర్ఘ వేటకు ముగింపు దొరికింది. ఇండియా, పాకిస్తాన్‌లలో ఉగ్రవాదదాడులకు ప్రణాళికలు వేయడంలో, వాటిని అమలు చేయడంలో ఖతల్ చురుకైన పాత్ర పోషించే వాడు. దీంతోనే ఖతల్‌ను భారతదేశం మోస్ట్-వాంటెడ్ జాబితాలో పెట్టింది.
ఇవి కూడా చదవండి:
హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన టోల్ ట్యాక్స్
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..