Home » Telugu Desam Party
ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాంపై తెలుగుదేశం పార్టీ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లే కాదు.. ఆస్తులకూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం తమ్మినేనికి అలవాటేనని ఆరోపణలు చేశారు.
ఏపీలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాత జరిగిన తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన గొడవలు అన్నీ ఇన్నీ కావు. కొద్దిరోజులుగా సైలెంట్గా ఉందని అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్లీ వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తాడిపత్రి ఏబీఎన్ రిపోర్టర్ రమణను కాల్చేస్తానంటూ గన్ తీసి వైసీపీ నేత కందిగోపుల మురళీ ప్రసాద్ రెడ్డి హల్చల్ చేశారు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అండగా నిలిచేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. వైసీపీ నేతల పితూరీల కారణంగా ఆగిపోయిన రుణ ప్రణాళిక మళ్లీ తెరమీదకు వస్తోంది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బిజిబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో క్రికెట్ టీమ్కే పరిమితమైన వైసీపీ (YSR Congress).. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి సత్తా ఏంటో చూపించాలని విశ్వప్రయత్నాలే చేస్తోంది హైకమాండ్. అయితే.. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా బలమున్న..
వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు..! టీడీపీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు..
అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు 12 ఎకరాలు ఇచ్చారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రూ.175 కోట్లతో విజయవాడలో ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ, రూ.400 కోట్లతో బడ్జెట్ పెంచి అంబేద్కర్ పేరుతో అవినీతి చేశారని విమర్శించారు.
తెలంగాణలో భవిష్యత్లో అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తెలిపారు. త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతానని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది...
ఇద్దరు సామాన్య టీడీపీ (Telugu Desam) కార్యకర్తలకు అరుదైన గౌరవం లభించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం వారిద్దరినీ అమరావతి సచివాలయానికి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు...