Share News

Burla Ramanjaneyulu: అంబేద్కర్ పేరుతో జగన్ ప్రభుత్వం అవినీతి

ABN , Publish Date - Aug 10 , 2024 | 09:39 PM

అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు 12 ఎకరాలు ఇచ్చారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రూ.175 కోట్లతో విజయవాడలో ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ, రూ.400 కోట్లతో బడ్జెట్ పెంచి అంబేద్కర్ పేరుతో అవినీతి చేశారని విమర్శించారు.

Burla Ramanjaneyulu: అంబేద్కర్ పేరుతో జగన్ ప్రభుత్వం అవినీతి
Burla Ramanjaneyulu

గుంటూరు జిల్లా: అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు 12 ఎకరాలు ఇచ్చారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రూ.175 కోట్లతో విజయవాడలో ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ, రూ.400 కోట్లతో బడ్జెట్ పెంచి అంబేద్కర్ పేరుతో అవినీతి చేశారని విమర్శించారు.


శనివారం నాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ, జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ పేరు కన్నా పెద్దగా జగన్ పేరు ఉండటం దళితులకు నచ్చలేదని చెప్పారు. 27 పథకాలు రద్దు చేసి, రూ.42 వేల కోట్లు నిధులు మళ్లించినప్పుడు దళిత సంఘాలనేతలు ఏమయ్యారని ప్రశ్నించారు. 188 మంది దళితులను వైసీపీ ప్రభుత్వంలో చంపేస్తే ఏం చేశారని నిలదీశారు. దళితుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టినప్పడు దళిత నేతలంతా ఏమయ్యారని అడిగారు.


దళిత ద్రోహి జగన్: మహాసేన రాజేష్

mahasena-rajesh.jpg

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యభిచారులు, హంతకులకు నాయకుడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ (Mahasena Rajesh) ఆరోపించారు. జగన్ రెడ్డి అరాచకం ముందు ఫ్యాబ్లో ఎస్కోబార్ కూడా ఎందుకు పనికి రాడని విమర్శించారు. అంబేద్కరిజంపై దాడి చేసిన ద్రోహి జగన్ రెడ్డి అని ఆక్షేపించారు. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుల పేర్లు అంబేద్కర్ కాళ్లకింద ఉండటానికి కూడా దళిత సమాజం ఓప్పుకోవడంలేదని అన్నారు.


అందుకే ఎవరో జగన్ రెడ్డి పేరును తొలగించారని చెప్పారు. పేరు తొలగింపునపై జగన్ &కో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు, మంత్రి నారా లోకేష్‌లపై విష ప్రచారం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇలా పేర్ల తొలగింపును తాను ఖడిస్తున్నానని అన్నారు. కాని ఒక దళిత బిడ్డగా దళితులకు ద్రోహం చేసిన జగన్ పేరు తొలగించడాన్ని తాను మద్దతిస్తున్నానని మహాసేన రాజేష్ తెలిపారు.

Updated Date - Aug 10 , 2024 | 09:39 PM