B.Venkat: కేంద్రం తక్షణమే వరద సాయం అందించాలి
ABN , Publish Date - Sep 04 , 2024 | 12:49 PM
Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తక్షణ వరద సహాయం అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... విపత్తు నిర్వహణ నిధులున్నా కేంద్రం వరద సాయం అందించడంలో అలసత్వం వహిస్తోందన్నారు. కేంద్ర బృందాలను వెంటనే తెలుగు రాష్ట్రాలకు పంపి నష్ట అంచనా వేసి సహాయం అందించాలని...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: తెలుగు రాష్ట్రాలకు (Telugu States) కేంద్రం తక్షణ వరద సహాయం అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... విపత్తు నిర్వహణ నిధులున్నా కేంద్రం వరద సాయం అందించడంలో అలసత్వం వహిస్తోందన్నారు. కేంద్ర బృందాలను వెంటనే తెలుగు రాష్ట్రాలకు పంపి నష్ట అంచనా వేసి సహాయం అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.
AP Highcourt: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ తిరస్కరణ
తెలుగు రాష్ట్రాలు అకాల వర్షాలతో ఇబ్బంది పడుతుంటే కిషన్ రెడ్డి రాజకీయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి వరదలను విపత్తుగా చూడకుండా రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. మత ఘర్షణలు రెచ్చగొట్టేందుకే కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అని వ్యాఖ్యలు చేశారు. విపత్తు సంభవిస్తే అమిత్ షా తెలంగాణలో పర్యటించలేదని.. కానీ విమోచన దినానికి వస్తున్నారన్నారు. అకాల వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో కోలుకోలేని నష్టం సంభవంచిందని తెలిపారు. వరదలు, అకాల వర్షాల వల్ల విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అపార నష్టం జరిగిందన్నారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు వేల కోట్లు ఉన్నా మోడీ వాటిని నియంత్రిస్తూ నిధులు ఇవ్వడం లేదన్నారు. కోవిడ్ సమయంలో ప్రధాన మంత్రి సహాయ నిధికి కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయన్నారు. కేరళ వయనాడ్‌ను, తెలంగాణ ఖమ్మం, ఏపీ విజయవాడ, అస్సాంను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Chandrababu: బుడమేరుకు మళ్లీ వరద.. లోకేష్‌కు చంద్రబాబు కీలక ఆదేశాలు..
రాష్ట్ర ప్రభుత్వాలు కోరినట్లుగా జాతీయ విపత్తులుగా ప్రకటించి సహాయం అందించాలన్నారు. మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడలో వరదల్లో ప్రజలు చనిపోయారని తెలిపారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.50 వేలు, 50 కిలోల బియ్యం నిత్యావసరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణలో భారీగా పంట నష్టం జరిగిందన్నారు. వరికి ఎకరానికి 25 వేలు సాయం అందించాలని.. పత్తి వాణిజ్య పంటలకు రూ.50 వేలు సాయం ఇవ్వాలన్నారు. చిన్న వ్యాపారులు, ఇల్లు కోల్పోయినవారు, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అని అన్నారు. చనిపోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.50 లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం వరద సహాయం అందించేందుకు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి సహాయం అందిస్తామన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామన్నారు. వయనాడ్ విపత్తు తరువాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నా కేంద్రం అలసత్వం వహించిందని బి.వెంకట్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
Vijayawada: కాలనీలకు అందని సాయం.. వరద నీటిలోనే బాధితులు
AP Highcourt: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు.. వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ తిరస్కరణ
Read Latest Telangana News And Telugu News