Share News

Chandrababu: 30 ఇయర్స్‌ బాబు!

ABN , Publish Date - Aug 31 , 2024 | 04:08 AM

చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆదివారాని(సెప్టెంబరు1)కి 30 ఏళ్లవుతున్నాయని టీడీ పీ నేతలు తెలిపారు.

Chandrababu: 30 ఇయర్స్‌ బాబు!
Nara Chandrababu Naidu

  • తొలిసారి సీఎం అయి రేపటితో 30 ఏళ్లు

  • ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు

  • రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సంబరాలు

  • వైసీపీలో మిగిలేది ఆ ముగ్గురే: వసంత

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): నారా చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆదివారాని (సెప్టెంబరు1)కి 30 ఏళ్లవుతున్నాయని టీడీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు శుక్రవారం మాట్లాడారు. 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు తొలిసారి సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీఎం కావడం రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు. ఆయన సీఎంగా గాక సీఈవోగా దేశమంతటా గుర్తింపు పొందారు. నాడు ఆయన అనుసరించిన విధానాలను ఆ తర్వాత దేశమంతా అనుసరించింది. అదే మాదిరిగా విభజిత ఏపీని కూడా పరుగులు పెట్టించడానికి చంద్రబాబు తపన పడుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే నవ్యాంధ్ర ఎక్కడికో వెళ్లేది. గత ఐదేళ్లలో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చంద్రబాబు ఇప్పుడు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌గా మార్చి పెట్టుబడులు సాధించడానికి ప్రయత్నిస్తున్నారుఅని భరత్‌ అన్నారు.

Chandrababu.jpg


మన తరంలో చంద్రబాబు దార్శనికుడని కృష్ణప్రసాద్‌ కొనియాడారు. ‘తెలుగువారు అనేక మంది దేశ విదేశాల్లో ముందు వరసలో ఉన్నారంటే అది ఆయన కృషితోనే సాధ్యమైంది. జగన్‌ రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. రాజధాని లేకుం డా చేశారు. జగన్‌ హయాంలో నిలిచిపోయిన పోలవరా న్ని రెండు మూడేళ్లలో మా ప్రభుత్వం పూర్తి చేయబోతోంది. జగన్‌ నైజం ఆయన పార్టీ వారికి కూడా అర్థమైంది. అందుకే రాజీనామాల పర్వం నడుస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీకి జగన్‌, విజయసాయిరెడ్డి, సజ్జల తప్ప మరెవరూ మిగలరు. పార్టీని నిలుపుకోవడానికి రాబోయే రోజుల్లో జగన్‌ దుష్ప్రచారాలకు తెరదీస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలిఅని పిలుపిచ్చారు.

Chandrababu-2.jpg


మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు వేసిన పునాది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరచిందని అశోక్‌బాబు చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్‌ బృందం మాత్రమే బాగుపడిందని, సర్వ వ్యవస్థలూ నాశనమయ్యాయని విమర్శించారు. చంద్రబాబు విజన్‌-2020 ప్రణాళికను ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడదే నిజమై కళ్ల ముందు కనిపిస్తోందని గోనుగుంట్ల వ్యాఖ్యానించారు.

Chandrababu-1.jpg

Updated Date - Aug 31 , 2024 | 09:00 AM