Home » TS Election 2023
కాంగ్రెస్ నేతలపై మంత్రి శ్రీనినాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దొంగసర్వేలు, దొంగ హామీలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ( YCP ) కి భావజాలం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పవన్ అధ్యక్షతన జరిగిన భేటీలో నాదెండ్ల మనోహర్, నాగబాబు, రాష్ట్రస్థాయి నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి. ఈసారి 70కు పైగా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ( Telangana Assembly Election ) ల్లో 70.74 శాతం పోలింగ్ ( Polling ) అయిందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ఈసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. గతం కంటే 3 శాతం పోలింగ్ తగ్గిందని చెప్పారు. 2018లో 73.37 పోలింగ్ శాతం నమోదయిందని చెప్పారు. 2018 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు.
ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్‌కు చేరే వరకు కాంగ్రెస్ అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
గజ్వేల్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, జీతాలు పెన్షన్లు ఇవ్వాలంటే భూములు అమ్మాల్సిందే అని విమర్శించారు.
ఎగ్జిట్ పోల్స్ తారు మారు అవుతాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. గతంలో కూడా బీజేపీకి సీట్లే రావని అన్నారని, జీహెచ్‌ఎంసీ, దుబ్బాకలో బీజేపీ గెలవదని అన్నారని బండి సంజయ్ గుర్తు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌పై ఆరా మస్తాన్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు నష్టం చేశాయని ఆరా మస్తాన్ తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొడతామని కేటీఆర్ తెలిపారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పోటీ చేశారు. అయితే బర్రెలక్క భవితవ్యంపై ఎగ్జిట్ పోల్స్ ఏం చేప్తున్నాయి?.