Share News

KTR: మళ్లీ అధికారం మాదే.. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే క్షమాపణలు చెబుతారా?

ABN , First Publish Date - 2023-11-30T18:38:47+05:30 IST

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొడతామని కేటీఆర్‌ తెలిపారు.

KTR: మళ్లీ అధికారం మాదే.. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే క్షమాపణలు చెబుతారా?

హైదరాబాద్: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొడతామని కేటీఆర్‌ తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కంగారుపడాల్సిన అవసరం లేదని, ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే డిసెంబర్‌ 3 తర్వాత క్షమాపణలు చెబుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

"మళ్లీ అధికారం మాదే.. హ్యాట్రిక్ కొడతాం. 2018 తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని తేలాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఓ రబ్బిష్‌. ఎగ్జిట్‌ పోల్స్‌ గతంలోనూ చూశాం. మాకు కొత్తకాదు. డిసెంబర్‌ 3న మళ్లీ అధికారం చేపడతాం. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కంగారుపడాల్సిన అవసరం లేదు. 70 పైగా స్థానాల్లో తిరిగి అధికారంలోకి వస్తాం. ఎగ్జిట్ పోల్స్‌తో న్యూసెన్స్ నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఓటర్లు క్యూ లైన్ లోనే ఉన్నారు. ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్ కు ఎలా పర్మిషన్ ఇస్తుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పయితే డిసెంబర్‌ 3 తర్వాత క్షమాపణలు చెప్తారా?." అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Updated Date - 2023-11-30T18:58:35+05:30 IST