Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌పై కేటీఆర్ వ్యాఖ్యలే బీఆర్ఎస్‌కు నష్టం చేశాయి: ఆరా సర్వే
ABN , First Publish Date - 2023-11-30T20:33:13+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌పై ఆరా మస్తాన్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు నష్టం చేశాయని ఆరా మస్తాన్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌పై ఆరా మస్తాన్ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు నష్టం చేశాయని ఆరా మస్తాన్ తెలిపారు. బీఆర్ఎస్ చేసిన తప్పుల్లో చంద్రబాబుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే అతిపెద్ద తప్పు అని ఆరా సర్వేలో స్పష్టమైంది.
"సెటిలర్స్ కాంగ్రెస్ వైపే నిలిచారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడం వల్లే ఆ పార్టీ నష్టపోయింది. కవిత లిక్కర్ స్కాం వల్ల రాష్ట్ర రాజకీయాలు మారాయి. కవితని అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్మారు. కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల బీజేపీ డౌన్ ఫాల్ అయింది. బీఆర్ఎస్ గెలిచే స్థానాలను బీజేపీ గెలవబోతోంది. బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి 90 స్థానాలు వచ్చేవి. ప్రభుత్వ పాలన బాగానే ఉన్నా, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు అందుబాటులో లేరని విమర్శ ఎక్కువగా ఉంది. సంక్షేమ పథకాలు బాగున్నా, ప్రభుత్వం కుటుంబ పాలనగా మారిందనే అభిప్రాయం ఏర్పడింది." అని ఆరా మస్తాన్ తెలిపారు.