Home » TS News
అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం నేడు జరగనుంది. పార్టీలో తమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కటం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని పంచ్‌లు వేశారు.
లోన్ యాప్‌ల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అధిక వడ్డీతో పాటు లోన్ యాప్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుండటంతో మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్అని.. మా రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన 16వ ఆర్ధిక సంఘం సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. నేడు ప్రజా భవన్లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో భట్టి మాట్లాడుతూ.. పన్నుల నుంచి తెలంగాణకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు.
మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డికి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి శ్వేత అనారోగ్య కారణాలతో మృతి చెందారు. హోమియోపతి వైద్యుడైన లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ తరుఫున జడ్చర్ల నియోజకర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇవాళ రెండో రోజు తెలంగాణలో 16వ ఆర్థిక సంఘం పర్యటించనుంది. 12 గంటలకు ప్రజా భవన్లో సంఘం చైర్మన్ అర్వింద్ పణగారియా, సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు భేటీ కానున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. 41.60 అడుగుల వద్ద 8,72,255 క్యూసెక్కులకు వరద ఉధృతి చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉధృతి కొనసాగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (సోమవారం) నాంపల్లిలో ఐఐహెచ్‌టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐహెచ్‌టీని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి హ్యాండ్లూమ్ కోర్సులు చదవాల్సి వస్తోందని అన్నారు.