Share News

TS News: జోగులాంబ ఆలయంలో వసతుల నిర్వహణకు వేలం.. సరికొత్త రికార్డులు

ABN , Publish Date - Oct 25 , 2024 | 06:32 PM

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ (శుక్రవారం) కీలక ప్రక్రియ ముగిసింది. ఆలయానికి సంబంధించిన టెంకాయలు, వసతి గృహాల నిర్వహణ, మరుగుదొడ్లు నిర్వహణ, షాపులకు, పార్కింగ్ స్థలాల నిర్వహణకు సంబంధి వేలంపాట ప్రక్రియ జరిగింది.

TS News: జోగులాంబ ఆలయంలో వసతుల నిర్వహణకు వేలం.. సరికొత్త రికార్డులు

అలంపూర్ : జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ (శుక్రవారం) కీలక ప్రక్రియ ముగిసింది. ఆలయానికి సంబంధించిన టెంకాయలు, వసతి గృహాల నిర్వహణ, మరుగుదొడ్లు నిర్వహణ, షాపులకు, పార్కింగ్ స్థలాల నిర్వహణకు సంబంధి వేలంపాట ప్రక్రియ జరిగింది. హోరాహోరీగా సాగిన వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.

టెంకాయల ( పూజా సామాగ్రి) వేలం రికార్డ్ స్థాయిలో జరిగింది. గతంలో కంటే రెట్టింపు ధర పలికింది. పూజా సామాగ్రి వేలం ఈసారి ఏకంగా రూ.1.27 కోట్లు పలికింది. మొత్తం అన్ని వసతుల నిర్వహణ వేలం ద్వారా ఆలయానికి మొత్తం రూ.3.48 కోట్ల ఆదాయం లభించింది.


కాగా శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం.. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లో ఉంది. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి అలంపూర్ దాదాపు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్-బెంగళూరు హైవే ద్వారా చేరుకోవచ్చు.

Updated Date - Oct 25 , 2024 | 06:35 PM