-
-
Home » Mukhyaamshalu » Breaking News September 14th Today Latest Telugu News Live Updates Siva
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Sep 14 , 2024 | 07:53 AM
Breaking News September 14th Today Latest Telugu News Live Updates Siva
Live News & Update
-
2024-09-14T13:18:43+05:30
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కి నటి జత్వానీ.. ఎందుకంటే..
ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ముంబై నటి జత్వానీ.
శుక్రవారం రాత్రి న్యాయవాదులతో కలిసి వచ్చిన జత్వాని.
ఇప్పుడు తల్లిదండ్రులతో కలిసి స్టేషన్‌కి వచ్చిన జత్వాని.
-
2024-09-14T12:02:25+05:30
‘కౌశిక్ అన్నా.. ఎట్లున్నవ్’.. కేటీఆర్ పరామర్శ..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్.
కౌశిక్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్.
ఆయనను ఆలింగనం చేసుకున్న కేటీఆర్.
టైగర్ కౌశిక్ భాయ్ అంటూ సంబోధన.
బైపాస్ సర్జరీ చేయించుకుని మొన్నటి దాడిలో గాయపడ్డ కౌశిక్ రెడ్డి మామ కృష్ణారెడ్డిని పరామర్శించిన కేటీఆర్.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్.
కొండాపూర్ కౌశిక్ రెడ్డి ఇంటి నుండి హరీష్ రావు ఇంటికి బయలుదేరిన మాజీ మంత్రి కేటీఆర్.
-
2024-09-14T10:33:24+05:30
సీపీఎం కేంద్ర కార్యాలయానికి సీతారం ఏచూరి భౌతికకాయం
ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయం ఏ కేజీ భవన్‌కు సీతారాం ఏచూరి భౌతికకాయం తరలింపు.
కాసేపట్లో ప్రజలు కార్యకర్తల సందర్శనార్థం ఏచూరి భౌతికకాయం.
మధ్యాహ్నం 3గం.ల వరకు ప్రజలు కార్యకర్తల కడసారి నివాళి కోసం ఏ కేజీ భవన్లో పార్థీవదేహం.
సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానున్న ఏచూరి అంతిమయాత్ర.
ఏచూరి కోరిక మేరకు ఆయన భౌతిక కాయాన్ని పరిశోధనల కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి అందించనున్న కుటుంబ సభ్యులు.
మరికాసేపట్లో సీతారాం ఏచూరి పార్థివదేహానికి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, కేరళ సీఎం పినరయ్ విజయన్, ప్రకాష్ కారత్, బృందా కారత్, బీవీ రాఘవులు, మాజీ ఎంపీ మధు, పార్టీ శ్రేణులు నివాళులర్పించనున్నారు.
-
2024-09-14T10:20:57+05:30
కొనసాగుతున్న పడవల తొలగింపు ప్రక్రియ..
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద ఐదో రోజుకు చేరుకున్న పడవలు తొలగింపు ప్రక్రియ.
తొలగింపు ప్రక్రియలో పాల్గొంటున్న రెండు ప్రత్యేక బృందాలు.
తొలగింపు ప్రక్రియలో పాల్గొంటున్న వైజాగ్ నుంచి స్కూబా టీం, కాకినాడ నుంచి అబ్బులు టీం.
ఒకపక్క కటింగ్ మరోపక్క బయటకు లాగేందుకు ప్రయత్నాలు.
నిన్న కట్ చేసిన పడవను బయటకు లాగేందుకు ప్రయత్నం.
రెండు టీములు కలిసి పనిచేయడంతో ఫలించిన వ్యూహం.
పడవల్లో కదలికలు.. లాగే కొంది నీటిలోకి వెళ్లిన కటింగ్ అయిన పడవ.
నేడు ఒక పడవనైనా బయటికి లాగానే ప్రయత్నం.
-
2024-09-14T09:49:58+05:30
ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు..
ఎమ్మెల్యే గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేస్ నమోదు.
కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.
గాంధీతోపాటు, అతని కుమారుడు, గాంధీ సోదరుడి పైన కేసు నమోదు.
మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు.
కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్‌తో పాటు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లను నిందితులుగా చేర్చిన పోలీసులు.
-
2024-09-14T07:55:37+05:30
మాజీ మంత్రి సోదరుడికి పోలీసుల నోటీసులు..
మాజీమంత్రి అంజాద్ భాష సోదరుడు అహ్మద్ భాషకు 41ఏ నోటీసు ఇచ్చిన పోలీసులు.
హోమ్ మంత్రి అనిత, కడప ఎమ్మెల్యే మాధవిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైనపోస్టులను పోస్టుచేసిన వైసీపీశ్రేణు లు.
ఈ కేసులో విచారణకు రావాలని అహ్మద్ భాషకు నోటీసులు.
-
2024-09-14T07:53:16+05:30
చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం..
బంగారుపాలెం మండలం బెంగుళూరు-చెన్నై జాతీయ రహదారి తగ్గువారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.
ఇద్దరు వ్యక్తులు మృతి.
మరో నలుగురికి తీవ్ర గాయాలు.
హైవేపై రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న కారు.
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి.
మరో నలుగురికి తీవ్ర గాయాలు.
బెంగళూరు వైపు నుంచి తిరుపతి వైపు వెళుతుండగా ప్రమాదం.
గాయపడ్డ వ్యక్తులను స్థానిక బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలింపు.