Home » TTDP
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదీ వర్షా కాలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ వరుసగా తగలబడుతున్నాయి. తాజాగా అంటే.. శనివారం తిరుపతిలోని శ్రీవారి పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
తెలంగాణలోనూ పునర్వైభవం సాధించాలని చూస్తున్న టీడీపీ ఈసారి పెద్ద నేతలనే రంగంలోకి దింపాలని చూస్తోంది. టీటీడీపీ అధ్యక్ష బాధ్యతలను నారా బ్రాహ్మణి లేదంటే నారా లోకేష్‌కి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా నందమూరి సుహాసిని, బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.
హైదరాబాద్: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1995లో పరిపాలనను మళ్ళీ చూపిస్తానని అన్నారు.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు చేరుకున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి ఎన్టీఆర్ భవన్‌కు వచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నామని, సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చొరవ చూపటం శుభపరిణామమని టీటీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Mallareddy) చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్య అనుచరులతో గత రెండు రోజులుగా మల్లారెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం.
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ(BJP)కి మద్దతు ఇవ్వాలని టీటీడీపీ(TTDP) నిర్ణయించింది. ఇందులో భాగంగా, టీటీడీపీ నేతలతో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి(Former MLA Chintala Ramachandra Reddy) చర్చలు జరిపారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా బీజేపీ (BJP) పార్టీకి తెలుగుదేశం (Telugu Desam Party) మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర కీలక నేతలు ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో... ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తోంది..