శ్రీవారి ఆలయ ఫైల్స్ కే రక్షణ లేకపోతే ఎలా?
ABN, Publish Date - Aug 18 , 2024 | 06:30 PM
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదీ వర్షా కాలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ వరుసగా తగలబడుతున్నాయి. తాజాగా అంటే.. శనివారం తిరుపతిలోని శ్రీవారి పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదీ వర్షా కాలంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ వరుసగా తగలబడుతున్నాయి. తాజాగా అంటే.. శనివారం తిరుపతిలోని శ్రీవారి పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో పలు ఫైళ్లు తగలబడ్డాయి. టీటీడీకి చెందిన డిప్యూటీ ఈఈ కార్యాలయంలో పలు కీలక ఫైళ్లు దగ్థం కావడంపై తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు సందేహం వ్యక్తం చేశారు.
కుట్రపూరితంగా ఫైళ్లు దగ్దమై ఉంటే.. కుట్రదారులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ దేవదేవుడి ఆలయానికి సంబంధించిన ఫైళ్లకే రక్షణ లేకుంటే ఎలా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదం విజిలెన్స్ నోటిసుల్లోకి వెళ్లిందా? లేదా అని ప్రశ్నించారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని టీటీడీ ప్రభుత్వ అధికారులకు సూచించారు.
Updated at - Aug 18 , 2024 | 06:30 PM