Share News

Chandrababu: నా కోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డా..: చంద్రబాబు

ABN , Publish Date - Jul 07 , 2024 | 01:24 PM

హైదరాబాద్: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా నందమూరి సుహాసిని, బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Chandrababu: నా కోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డా..: చంద్రబాబు

హైదరాబాద్: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా నందమూరి సుహాసిని, బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై టీడీపీకి పునర్‌వైభవం వస్తుందని, ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లు అని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందని, తెలుగు జాతి అనేక సంక్షోభాలు ఎదుర్కొందన్నారు. టీడీపీ కూడా రాజకీయంగా అనేక సంక్షోభాలు ఎదుర్కొందని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటూ టీడీపీ ఎదిగిందన్నారు. తెలంగాణలో అధికారం లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదని కొనియాడారు. తెలంగాణ టీడీపీ శ్రేణులు ఏపీలో తన విజయానికి కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల అభిమానం చూస్తుంటే తనకు ఉత్సాహం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.


తనను ఏ కారణం లేకుండానే జైలులో పెట్టారని, తన కోసం హైదరాబాద్‌ వాసులు చేసిన ఆందోళన మరిచిపోలేనని, తనకు మద్దతుగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభ మర్చిపోలేనని చంద్రబాబు అన్నారు. తన కోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డానని, తన జన్మధన్యమైందని అనిపించిందని చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉందని, తెలంగాణ సీఎం రేవంత్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే టీడీపీ ధ్యేయమని, తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఉంటే నష్టాలే ఎక్కువన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటేనే సమస్యల పరిష్కారం అవుతుందని, తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.


2019 తర్వాత ఏపీలో విధ్వంసం జరిగిందని, విభజన వల్ల జరిగిన నష్టం కంటే..వైసీపీ పాలనలో జరిగిన నష్టమే చాలా ఎక్కువని చంద్రబాబు అన్నారు. ఏపీని గట్టేక్కించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఏపీలో నాలెడ్జ్‌ ఎకానమీకి నాంది పలికామని, తెలుగువారు గ్లోబల్‌ నాయకులుగా ఎదగాలని సూచించారు. బ్రిటన్‌ ఎన్నికల్లో 25 మంది భారతీయులు గెలిచారన్నారు. మోదీ వికసిత్‌ భారత్‌లో తెలుగు జాతి మొదటిస్థానంలో ఉంటుందని, 2047 నాటికి భారత్‌ నెంబర్‌ వన్‌గా ఎదుగుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో బోనాల సందడి..

రుషికొండ భవనాలకు నోటీసులు

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్?

ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ.. చికిత్స పొందుతూ మృతి..

తండ్రి బాటలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 07 , 2024 | 02:01 PM