Home » Union Budget
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2024-25 బడ్జెట్‌లో ఢిల్లీకి రూ.350 కోట్లకు మించి కేటాయించరని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ జోస్యం చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మంగళవారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానంతరం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
ఏటా బడ్జెట్ ప్రక్రియ చివరి దశలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే 'హల్వా' వేడుక ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో మంగళవారంనాడు జరిగింది. కేంద్ర బడ్జెట్-2024-25 ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
కేంద్రంలోని మోదీ(PM Modi) సర్కార్ జులై 23న 2024 - 25 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్(Union Budget 2024 - 25) ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా దేశ ఆర్థిక స్థితిగతులపై సమీక్షించడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ సమర్పణ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారంనాడు ప్రకటించారు. జూలై 22వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీతో ముగుస్తాయని, బడ్జెట్ సమావేశాల రెండో రోజైన జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడతారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మంత్రి తెలిపారు.
Union Budget 2024: జూన్ 24వ తేదీన 18వ లోక్‌సభ మొదటి సెషన్ ప్రారంభం కాగా.. జూన్ 26న బీజేపీ ఎంపీ ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సైతం త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
దేశంలో నరేంద్ర మోదీ(narendra modi) ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ను(Union Budget 2024) వచ్చే నెల 22వ సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
గురువారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. ‘ఐమెక్’ (IMEC) ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. రాబోయే వందేళ్లలో ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వాణిజ్యానికి ఆధారం కానుందని, భారత్‌తో పాటు యావత్ ప్రపంచానికే ఇది గేమ్‌చేంజర్‌గా మారుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై(Union Budget 2024) కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్(Shashi Tharoor) విమర్శలు సంధించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం లెక్కల పేరుతో గారడీలు ప్రదర్శించిందని విమర్శించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (01/02/24) మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో.. తమకు తప్పకుండా ప్రయోజనాలు ఉంటాయని, ఆర్థిక మంత్రి భారీ ప్రకటనలు చేస్తారని అన్ని రంగాల వాళ్లు అభిప్రాయపడ్డారు. ఆశించినట్టుగానే కొందరికి ప్రయోజనాలు చేకూరేలా నిర్మలా సీతారామన్ ప్రకటనలిచ్చారు.