Share News

Sanjay Singh: బడ్జెట్‌కు ముందే ఆ విషయం లీక్ చేస్తున్నా...ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్య

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:33 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2024-25 బడ్జెట్‌లో ఢిల్లీకి రూ.350 కోట్లకు మించి కేటాయించరని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ జోస్యం చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మంగళవారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానంతరం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.

Sanjay Singh: బడ్జెట్‌కు ముందే ఆ విషయం లీక్ చేస్తున్నా...ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్య

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2024-25 బడ్జెట్‌లో ఢిల్లీకి రూ.350 కోట్లకు మించి కేటాయించరని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) జోస్యం చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మంగళవారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానంతరం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, విపక్ష నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసగొలుతూ వాటిని దుర్వినియోగం చేయడం, అతిపెద్ద బాధిత పార్టీగా ఆప్ నిలవడం సహా పలు అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయన్నారు. బడ్జెట్ పరంగా ఢిల్లీ, పంజాబ్‌లకు కేటాయింపుల అంశాన్ని కూడా తాను ప్రస్తావించినట్టు చెప్పారు.


''బడ్జెట్ రాబోతోంది. అంతకుముందే నేను ఓ విషయం లీక్ చేస్తున్నాను. ఢిల్లీకి రూ.350 కోట్లకు మించి బడ్జెట్ కేటాయింపు జరగదు'' అని సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Rajnath Appel: మోదీ మాట్లాడేటప్పుడు సభలో అడ్డుపడకండి.. అఖిలపక్షంలో రాజ్‌నాథ్ అప్పీల్


కన్వర్ యాత్రామార్గంలో యూపీ ఆదేశాలపై..

కన్వర్ యాత్రా మార్గంలో తినుబండారాల దుకాణాల వద్ద నేమ్‌పేట్లు తగిలించాలని ఉత్తప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సింగ్ తప్పుపట్టారు. ఇది దళితులు, వెనుకబడిన గిరిజనులు, ఇతరుల వ్యాపారాలు మూతపడడానికి ఇచ్చిన ఆదేశాలని, విపక్షాపూరితమైనవనీ అన్నారు. ఇదే వ్యక్తులు అయోధ్యలో రామాలయం ప్రారంభానికి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదన్నారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 21 , 2024 | 05:46 PM