Home » Uttar Pradesh
మహా కుంభమేళా 2025లో మాఘపూర్ణిమ రోజు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం 4 నుంచే సీఎం వార్ రూమ్ నుంచి ఆయా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో రేపు (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ చుట్టు పట్ల రెండు రోజుల ముందు నుంచే దాదాపు 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని జనసమూహ నియంత్రణకు.. రేపటి నుంచి మహా కుంభమేళాలో ఈ సమయాల్లో నో వెహికల్ జోన్ రూల్ అమల్లోకి రానుంది.
Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో రేపే (ఫిబ్రవరి 12) మాఘ పూర్ణిమ రాజస్నానం. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు చేయాల్సిన సన్నాహాలు, ట్రాఫిక్ నియంత్రణ మార్గదర్శకాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు.
మీరు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా కోసం వెళ్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే మీరు మాత్రం ఈ ప్రాంతాల్లో ప్రయాణించకండి. పలు చోట్ల మాత్రం భారీగా ట్రాఫిక్ ఉంటుంది. దీనిని అధిగమించడానికి ఏం చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Maha Kumbh Mela 2025 : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హాజరయ్యారు. భద్రతా సిబ్బంది మధ్య ఉదయం త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరించారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
ఇప్పటికే కుంభమేళాలో నాలుగు రాజ స్నానాలు పూర్తయ్యాయి. భోగి, మకర సంక్రాంతి, పుష్య బహుళ అమావాస్య, వసంత పంచమి రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాలుగు రాజ స్నానాలు చేశారు. ఐదో రాజ స్నానానికి కూడా సమయం ఆసన్నమైంది. ఐదో రాజ స్నానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మహాకుంభ్ మేళాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన సుమారు 8 గంటల సేపు జరుగుతుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. తొలుత సంగమ స్నానం, అనంతరం అక్షయ్‌వత్, బడే హనుమాన్ ఆలయాల్లో పూజ, దర్శనంలో పాల్గొంటారు.
ఫేస్బుక్ ద్వారా పాక్ యువతి ప్రేమలో పడ్డ ఓ 20 ఏళ్ల భారతీయ యువకుడు చివరకు పాకిస్థాన్ చేరి ఇక్కట్ల పాలయ్యాడు. అతడి ప్రేమను యువతి తిరస్కరించడంతో ఇబ్బందుల్లో పడి చివరకు పాక్ పోలీసులకు చిక్కాడు. అతడి కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
మీరు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..