Home » Varla Ramaiah
మాజీ సీఎం జగన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చడం ఇకనైన ఆపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఉరుకుంటుందా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) లేఖ రాశారు.
ప్రజాభీష్టం ప్రకారమే ఎన్డీఏ పాలన నడుస్తుందని తెలుగుదేశం పొలిట్ బ్యూర్ సభ్యుడు వర్లరామయ్య (Varla Ramaiah) పేర్కొన్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడంతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు చేసుకుంటున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాటలు ఆత్మస్తుతి పరనిందలా ఉన్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan)పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నోఫికేషన్ తర్వాతే సీఎం జగన్ రానున్న రూ.4వేల కోట్లతో కలిపి దాదాపు రూ.25వేల కోట్ల అప్పులు(25 Thousand Crore Loans) చేశారని తెలిపారు.
అధికారంతో పేదల భూములు కొట్టేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‌గా జవహర్ రెడ్డి ఉంటే జనసేన నేత మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఆదేశాల మేరకు వారి అనుచరులు ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు క్యాన్సర్‌తో భాదపడుతున్నారని, అది మూడో దశలో ఉందని ఎక్స్(ట్విటర్)లో పోస్టు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొంగలు, దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా జగన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకొని, పంచుకుంటున్నారని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య (Varlaramaiah) అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారని, జూన్ 4వ తేదీన ఆ విషయం తెలుస్తోందన్నారు.
మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రజల్లో వస్తోన్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎం పగులగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణిచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.