Share News

Varla Ramaiah: సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి

ABN , Publish Date - Jun 01 , 2024 | 10:22 PM

అధికారంతో పేదల భూములు కొట్టేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‪గా జవహర్ రెడ్డి ఉంటే జనసేన నేత మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Varla Ramaiah: సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి
Varla Ramaiah

అమరావతి: అధికారంతో పేదల భూములు కొట్టేసేందుకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) కుట్ర పన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‪గా జవహర్ రెడ్డి ఉంటే జనసేన నేత మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కీలక పాత్రధారిగా ఉన్న పెద్దసారు (సీఎస్) దాదాపు రూ.2 వేల కోట్లు విలువ చేసే 800 ఎకరాల భూములను సీఎస్, ఆయన కుమారుడు, ఆయన బినామీలు కొట్టేశారని మూర్తియాదవ్ చేసిన ఆరోపణలు నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలు వస్తే నిరూపించుకోకుండా మూర్తియాదవ్‌ను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. పెద్ద సారు అల్లుడే మాఫియాను తనతో తిప్పుకుంటున్నాడని వార్తలు వస్తుంటే ఎందుకు స్పందించరు? దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు.


త్రిలోక్ అనే వ్యక్తి ఎవరు.. ?

‘‘కడప వ్యక్తి గుప్పెట్లో ఆరు ఎకరాలు ఉన్నాయి. ఈ కడప వ్యక్తి ఎవరో మీకు తెలుసా సార్ సీఎస్ గారు? ఈ త్రిలోక్ అనే వ్యక్తి ఎవరు.. ? విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఇతను మీకు ఎలా తెలుసు? తెలిస్తే ఎలా తెలుసో చెప్పండి. తెలిస్తే ఎవరు పరిచయం చేశారు. పెద్దసారేనా? పేదల భూములను కొట్టేయడానికి పంపారా? పేదల భూములను అప్పనంగా అతి తక్కువ ధరకే ఎలా కొట్టేశారు... అక్రమంగా పేదల భూములను ఎలా రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు? అధికారులపై ఆరోపణలు వస్తే పాలన యంత్రాంగం, ఏసీబీ ఊరుకుంటుందా? వెంటనే విచారణ వేసి నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవాలి. ఇప్పుడు చేతులు అన్ని సీఎస్ వైపు చూపిస్తున్నాయి. వెంటనే గవర్నర్ సీఎస్‌పై చర్యలకు ఆదేశించాలి.. సీఎస్ పదవి నుంచి జవహర్ రెడ్డిని పక్కనపెట్టి విచారణకు ఆదేశించాలి’’ అని డిమాండ్ చేశారు.


సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి

‘‘భూ దందాపై ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే సుమోటో కేసు నమోదు చేయాలి. ఏసీబీలో నిజాయతీగలిగిన అధికారికి ఆ కేసును అప్పగించాలి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎస్ అధికారంలో ఉంటే ఎన్నికల కౌంటింగ్ సక్రమంగా జరిగే అవకాశం లేదు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోని సీఎస్‌ను పదవి నుంచి తొలగించాలి. భూమి పట్టాలు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూముల దగ్గరకు మీరు వెళ్లి చూసి వస్తారు. ఆ తర్వాత త్రిలోక్ ముఠా గద్దల్లాగా అక్కడ వాలి పేదలను భ్రమ పెట్టి భూములను కొట్టేస్తున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కోరాల్సిన అధికారి ఇలా చేయడం కరెక్టేనా? త్రిలోక్ ముఠా కంచే వేయడానికి వెళ్తే రైతులు తిరగబడ్డారు.. మిమ్మల్ని కూడా బూతులు తిట్టారని వార్తలు వస్తే ఎందుకు స్పందించరు. సీఎస్ పేరు చెప్పి ముఠా పేట్రేగి పోతున్నారని వార్తలు వస్తుంటే ఎందుకు నోరు మెదపరు? ఈ భూ దందాపై ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజిర్ పూర్తి విచారణకు ఆదేశించాలి’’ అని వర్లరామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - Jun 01 , 2024 | 10:25 PM