Home » Vijayasai Reddy
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్విట్ వైరల్ అవుతుంది. నేను ఎటువైపు ఉన్నానంటూ ఎవరైనా అడిగితే.. ఖచ్చితంగా మా కుటుంబం వైపే ఉంటాను. ఏ విధమైన అంశాలు ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నానని పేర్కొంది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయదులు, న్యాయమూర్తులను సోషల్ మీడియాలో దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. మణి అన్నపురెడ్డి మారు వేషంలో ఇండియాలో తిరుగుతున్నా సీబీఐ పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరికాసేపట్లో హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్కు ఈ ఫిర్యాదును న్యాయవాది అందించనున్నారు.
నెల్లూరు: బలవంతంగా రూ. వంద ఇస్తాం.. రెండు వందలు ఇస్తామని చెప్పి వైసీపీ సభకు తీసుకువచ్చిన జనాలు 10 నిముషాలు కూడా ఉండడంలేదు. అసలే ఎండాకాలం... వైసీపీ ప్రభుత్వంపై పీకల వరకు కోపం.. ఈ దరిద్రం ఎప్పుడు పోతుందిరా బాబూ అంటూ వెయ్యి కళ్లతో చూస్తున్న తరుణంలో ఎంత పెద్దాయన వచ్చినా జనం వింటారా? వినరు.
వైసీపీ కోసం పనిచేయాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. నెల్లూరు మెప్మా పీడీ రవీంద్రని శలవు పెట్టి వెళ్లాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయమై ఎంపీ విజయసాయి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈసారి హవా టీడీపీ, జనసేన కూటమిది నడుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. ఈ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఈ తరుణంలో నెల్లూరు రూరల్లో వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది.
AP Elections 2024: విజయసాయిరెడ్డి.. వైసీపీలో (YSR Congress) కీలక నేతగా.. పార్టీలో నంబర్-02గా వ్యవహరిస్తూ వస్తున్నారు.! రెండోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు.! ఇలా సాయిరెడ్డి (Vijayasai Reddy).. జగన్ (YS Jagan Reddy) బాగు కోరుతుంటే.. జగన్ మాత్రం విజయసాయిని బలి పశువున చేశారనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి...
Andhrapradesh: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద మార్చి 10న సిద్దం నాల్గోవ సభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో సిద్దం సభ పోస్టర్ను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేసిందో సీఎం జగన్ సిద్ధం సభలో వివరిస్తారని తెలిపారు.
ఏపీలోని అధికార వైఎస్సార్సీపీ 9వ జాబితాను విడుదల చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళవారం నియోజకవర్గంలో ఇన్ఛార్జీని మార్చింది. గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్య పేరుని వైసీపీ హైకమాండ్ ప్రకటించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు జగన్కి, అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అధికార వైసీపీ రెండు మూడు రోజుల్లో అభ్యర్థులందరినీ ప్రకటించనుంది.