Amaravati: వైసీపీ అధినేత జగన్‌కు ఎందుకంత భయం: వర్ల రామయ్య..
ABN , Publish Date - Dec 18 , 2024 | 08:01 PM
దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కళంగిరి మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికా ముఖంగా స్పందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు తప్పని తేలే వరకూ పార్లమెంట్ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని అన్నారు.
అమరావతి: దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కళంగిరి మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికా ముఖంగా స్పందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు తప్పని తేలే వరకూ పార్లమెంట్ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని అన్నారు. గిరిజన స్ట్రీని లోబర్చుకుని ఓ కుటుంబాన్ని నాశనం చేశాడని వర్ల మండిపడ్డారు. శాంతి భర్త వారిద్దరిపై చేసిన ఆరోపణల విషయంలో ఎంపీ వెంటనే స్వచ్ఛందంగా విచారణ కోరాలని వర్ల డిమాండ్ చేశారు. తన భార్య శాంతిని తల్లిని చేశాడని, వందల కోట్ల విలువైన భూములను కొట్టేశాడని మదన్ మోహన్.. విజయసాయిరెడ్డిపై చేసిన ఆరోపణలపై ఆయన వెంటనే సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.. " గిరిజన స్త్రీని ప్రలోభపెట్టి రూ.1500 కోట్ల విలువైన దేవదాయ భూములు కొట్టేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. శాంతికి పుట్టిన బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని ఆమె భర్త మదన్ మోహన్ డిమాండ్ చేస్తుంటే విజయసాయిరెడ్డి ఎందుకు టెస్ట్‌కు నిలబడటం లేదు?. ఓ ఆదివాసీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడని ఇన్ని ఆరోపణలు వస్తున్నా విజయసాయిరెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారు?. విజయసాయిరెడ్డిపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఎందుకు విచారణ కోరడం లేదు?.
విజయసాయిరెడ్డిని వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు?. సస్పెండ్ చేస్తే తన గండికోట రహస్యం(తాడేపల్లి ప్యాలెస్ రహస్యం) బయటపడుతుందని జగన్‌కు భయమా?. వివేకా హత్య కేసును అతను బయటపెడతాడని జగన్ రెడ్డికి భయమా?. చిన్న ఆరోపణ వస్తేనే గతంలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వాస్తవం మూడు సార్లు ఎంపీగా గెలిచిన విజయసారెడ్డి గుర్తించాలి. సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు మాట్లాడటం ఇకనైనా మానుకోవాలి. విజయసాయిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని" డిమాండ్ చేశారు.
కాగా, మంత్రి నారా లోకేశ్‌ను దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ మంగళవారం కలిశారు. ఉండవల్లిలో లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఆయన వచ్చారు. ఎంపీ విజయసాయి రెడ్డి తన భార్య శాంతిని లోబర్చుకుని విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ పెద్దఎత్తున భూములు కొల్లగొట్టారని మంత్రికి మోహన్ వివరించారు. మెుత్తం రూ.1,500 కోట్ల భూములు దోచుకున్నారని ఆరోపించారు. తన భార్యను సైతం తాను లేని సమయంలో విజయసాయిరెడ్డి తల్లిని చేశాడంటూ గోడు వెల్లబోసుకున్నారు. మెుత్తం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. విషయాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
weather updates : అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Paritala Ravi: పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్..