Home » Visakhapatnam
2015లో ఏడేళ్ల బాలికను బీరు సీసాతో నిందితుడు గొంతుకోసి హత్య చేశాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతనిపై నేరం రుజువు కావడంతో బుధవారం న్యాయస్థానం నిందితుడికి మరణ శిక్ష విధించింది. కాగా చోడవరం కోర్టు చరిత్రలో మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరిచండం ఇదే ప్రథమం.
ఆ అపార్ట్మెంట్ సీపీ కెమెరాలు లేవు. ఘటన సమీపంలో మహిళ వెళుతున్నట్టు సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతో పోలీసులు ఆమె అదుపులోకి తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది.
భారత వాతావరణ శాఖ ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో సాధారణాన్ని మించిన ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. హీట్‌వేవ్ ప్రభావం ప్రధానంగా ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా ఉండనుంది
Lokesh On Visakhapatnam: విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చుతామని చెప్పుకొచ్చారు.
సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఏపీఎస్ఆర్టీసీ నర్సీపట్నం డిపోలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ తన భర్త మరణించాడని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు బ్రెడ్ విన్నర్ స్కీమ్ వర్తింపజేస్తామని 2013లో యూనియన్‌తో జరిగిన అగ్రిమెంట్ అమలు చేయకపోవడంతో తమ కుటుంబం రోడ్డున పడిందని విశాఖకు చెందిన కె.రమాదేవి మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్టణంలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మార్చి 30న ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో తేమ 70శాతం వరకు ఉండవచ్చని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.
విశాఖలో ఓ వ్యక్తి జర్నలిస్టులంటూ హల్చల్ చేశాడు. ఐస్‌క్రీం పార్లర్‌లోకి వెళ్లి ఐస్‌క్రీం తిన్నాడు. సిబ్బంది డబ్బులు అడిగినందుకు వారిపై దాడి చేశారు.దీంతో షాపు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Delivery Boy Assaulted: విశాఖలో డెలివరీ బాయ్‌పై ఓ వ్యక్తి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. బ్రో అని పిలిచాడంటూ డెలివరీ బాయ్‌పై ప్రసాద్ అనే వ్యక్తి దాడి చేశాడు.
విశాఖపట్నం వేదికగా సోమవారం రాత్రి ఐపీఎల్-2025 మ్యాచ్ జరగనుంది. రాత్రి 07:30 గంటలకు డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లు తలపడనున్నాయి.
మళ్ళీ సీఎం అవుతానని జగన్ కలలు కంటున్నారని, ఈసారి వైఎస్సార్సీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్రతి పక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని అనడం విడ్డూరంగా ఉందని.. జగన్‌ది రెండు నాల్కుల ధోరణి అని సోము వీర్రాజు విమర్శించారు.