Home » West Godavari
ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డిఎస్పీ హెచ్చరించారు.
పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన హనూక్ అనే యువకుణ్ని పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్నారు. అనంతరం యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి నిందితుణ్ని రిమాండ్కు తరలించారు.
Andhrapradesh: మాజీ మంత్రి జోగి రమేష్పై బీసీ నేత, శాసన మండలి మాజీ విప్ అంగర రామ్మోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబసభ్యుల అవినీతి పుట్ట కదులుతోందన్నారు. విజయవాడ శివారు అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములను జోగి కుమారుడు రాజు...
Andhrapradesh: ఏలూరులో మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం ఉదయం ఏలూరు కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మొక్కల నాటారు.
ఏలూరులో వైసీపీకి బిగ్ షాక్.. ఆ పార్టీనే కొన్నేళ్లుగా అంటి పెట్టుకుని వీర విధేయనేతగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైసీపీ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఇక ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేదిలేదని ప్రకటించారు. దీంతో ఏలూరులో వైసీపీ దాదాపు ఖాళీ అయ్యింది. ఇంతకుముందే..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అసలే వైసీపీ ఓడిపోయిందని.. పార్టీని గాడిలో పెట్టడానికి నానా తిప్పలు పడుతున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేతలు దిమ్మతిరిగే షాకులిస్తున్నారు. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో ముఖ్య నేతలు, మాజీలు రాజీనామా చేసేసి...
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడులు చేసే వారిలో ఎక్కువగా ప్రయాణికులే ఉంటారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా కొంతమంది దుండగులు డ్రైవర్పై దాడికి తెగబడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో రాష్ట్రాన్ని కూడా ప్రకృతి అదే విధంగా దీవిస్తోందని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఏపీలో జలకళ సంతరించుకుందని ఆయన చెప్పారు.
Andhrapradesh: పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు కారుపై జరిగిన రాయి దాడి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. దాడి జరిగిన ప్రాంతమైన హాస్టల్ పరిసరాల్లో జీలుగుమిల్లీ సీఐ క్రాంతి కుమార్, బుట్టాయిగూడెం ఎస్సై వెంకన్న తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ... కర్రలతో దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు.
Andhrapradesh: ఆయనో ప్రజాప్రతినిధి.. అయినా సరే సామాన్యుడిలా అవతారం ఎత్తాడు..! అసలేం జరుగుతోందని తెలుసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఓ ఉద్యోగి చేస్తున్న పని పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పని సమయాల్లో ఇంతటి నిర్లక్షమా అంటూ విరుచుకుపడ్డారు. ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలా వస్తారని ఊహించి ఉండరు అక్కడి సిబ్బంది.