Home » West Godavari
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోని గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సరైన ఆహారం, మంచినీరు, విద్యుత్ సదుపాయం లేక ప్రజలు తీవ్రఅవస్థలు పడతున్నారు. పంటలు నీట మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Andhrapradesh: ‘‘చింత చచ్చినా పులపు చావదు’’ అన్న సామెతగా ఉంది వైసీపీ నేతల ఆకృత్యాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసి.. అధికారాన్ని కోల్పోయినప్పటికీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. పలు చోట్ల బరితెగింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. పైకి మాత్రం అబ్బే.. మావాళ్ల మీదే దాడులు చేస్తున్నారంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతే కాదు ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిమరీ ధర్నాలు చేస్తున్నారు.
ప.గో.జిల్లా: నరసాపురం ఎంపీడీవో ఎం. వెంకటరమణా రావు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఎంపీడీవో అదృశ్యంపై ఫెర్రీ బకాయిదారు రెడ్డప్ప ధవేజీ స్పందించారు. ప్రభుత్వానికి తాను రూ. 50 లక్షలు బాకీ ఉన్న మాట నిజమేనని, దానికి సంబంధించి గ్యారంటీ నిమిత్తం ప్రభుత్వానికి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు.
ఎత్తైన భవనం.. నాలుగు వైపులా కోట మాదిరి బురుజులు.. బర్మా టేకుతో చేసిన సింహద్వారాలు.. తలుపులపై అందంగా చెక్కిన కళా రూపాలు.. విశాలమైన గదులు.. మయసభను తలపించే సెంట్రల్ హాలు..
Andhrapradesh: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ఎంపికైన విద్యార్థుల (Students) జాబితాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 67.15 శాతం మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.
Andhrapradesh: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మి నగర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రాలీ లారీని అతి వేగంగా దూసుకొచ్చిన ఎర్టిగా కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు రాచభత్తుని భాగ్యశ్రీ (26), బొమ్మ కమలాదేవి (53), నాగ నితిన్ కుమార్ (5) గా గుర్తించారు.
వైసీపీ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కూటమి నేతలతో సంప్రదింపులు జరిపారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నేతలే ఇలా పక్కదారి చూస్తుండడంతో నియోజకవర్గ నేత సంప్రదింపులు జరిపారు. పార్టీని వీడొద్దంటూ ప్రాధేయపడ్డారు.. అయినా నాయకులు తగ్గేదేలే అంటున్నారు..
Andhrapradesh: తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం నాడు తాను చదివిన పూర్వ పాఠశాలను సందర్శించిన మంత్రి.. విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి, హంగులు చేసి నిధులు దోపిడీ చేశారని మండిపడ్డారు.
Andhrapradesh: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలు ఇలా వేటినీ వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే దొంగతం చేసే సమయంలోనూ వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. బంగారం షాపుల్లోకి కొనుగోలుదారులుగానే వస్తూ.. షాపు యాజమాన్యం కన్ను గప్పి మరీ దొంగతనం చేసి సేఫ్గా తప్పించుకుంటున్నారు.
Andhrapradesh: రేపు (శనివారం) జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైనదని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామన్నారు.