Home » Yanamala RamaKrishnudu
నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. రెడ్డిగూడెం గ్రామంలో కూటమి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు.
Andhrapradesh: పూర్తిగా అమలు చేయదగ్గ మేనిఫెస్టోనే తాము రూపొందించామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... తమ మేనిఫెస్టో అమలుపై ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిస్తామని.. ఆదాయాన్ని పెంచుతామన్నారు. అనవసరపు ఖర్చులు తగ్గిచడం ద్వారా సుమారు రూ. 2-3 వేల కోట్లను ఆదా చేయవచ్చని చెప్పుకొచ్చారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులుపాలు చేశారంటూ మండిపడ్డారు. రాబోయే ప్రభుత్వాల అప్పులను కూడా జగనే చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతే వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరం రెండవ రోజునే జగన్ రెడ్డి ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పులు తెచ్చారన్నారు.
సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హానీ జరిగినా.. దానికి జగన్‌దే బాధ్యత అని పేర్కొన్నారు. సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటందన్నారు.
జగన్ ప్రభుత్వ ఆర్ధిక అరాచకత్వం హద్దులు దాటిందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైఎస్ జగన్ తన అసమర్థ, అస్తవ్యస్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ వేదికగా అబద్ధాలు వల్లించారని అన్నారు.
2024లో రానున్న రాజకీయ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలు, కుట్రలు కుతంత్రాలు...
రెవెన్యూ రాబడి వైసీపీ హయాంలో 16.7 శాతం మేర పెరిగింది.. అదే టీడీపీ హయాంలో 6 శాతం మాత్రమే పెరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి ( Buggana Rajendra Nath Reddy ) అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు ఇవ్వాలని తాను లేఖ రాస్తే, రెండు నెలలైనా ఆర్థిక శాఖ కార్యదర్శి నుంచి ప్రత్యుత్తరం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆక్షేపించారు.
ఆర్థిక మంత్రి బుగ్గనకు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.