Share News

కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక పన్ను మార్పులు..

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:22 AM

మీరు పన్ను చెల్లింపుదారా..? ఏటా ఆదాయ పన్ను రిటర్నులు సమర్పిస్తున్నారా..? అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్న కీలక పన్ను మార్పులను తప్పక తెలుసుకోవాల్సిందే..

కొత్త ఆర్థిక సంవత్సరంలో కీలక పన్ను మార్పులు..

మీరు పన్ను చెల్లింపుదారా..? ఏటా ఆదాయ పన్ను రిటర్నులు సమర్పిస్తున్నారా..? అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి రానున్న కీలక పన్ను మార్పులను తప్పక తెలుసుకోవాల్సిందే..

రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు: కొత్త పన్ను విధానంలో సెక్షన్‌ 87ఏ కింద లభించే పన్ను రిబేటును రూ.25,000 నుంచి రూ.60,000కు పెంచుతున్నట్లు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే, రూ.12 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారికి (వేతన జీవులైతే, స్టాండర్డ్‌ డిడక్షన్‌ వెసులుబాటుతో రూ.12.75 లక్షల వరకు ఆదాయంపై) పన్ను చెల్లింపుల నుంచి పూర్తిగా ఊరట లభించనుంది.


టీడీఎస్‌ నిబంధనలో మార్పులు: చిన్న మొత్తాల్లో పన్ను చెల్లించేవారికి ఊరట కల్పించేందుకు ఏప్రిల్‌ 1 నుంచి ట్యాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ (టీడీఎస్‌) పరిమితిని పెంచింది ప్రభుత్వం. ఉదాహరణకు సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ వర్తింపు పరిమితి రూ.లక్షకు పెరగనుంది. అంటే, వార్షిక వడ్డీ ఆదాయం రూ.లక్ష మించితేనే టీడీఎస్‌ వర్తిస్తుంది.

టీసీఎస్‌ నిబంధనలో మార్పు: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ట్యాక్స్‌ కలెక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌ (టీసీఎస్‌) పరిమితి కూడా పెరగనుంది. ఇది విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు, ఇతర లావాదేవీలను ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం రూ.7 లక్షలకు పైగా విదేశాలకు పంపే సొమ్ము పై ఏ అవసరం కోసం పంపుతున్నారన్న ఆధారంగా 0.5 శాతం నుంచి 20 శాతం వరకు టీసీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఈ పరిమితి రూ.10 లక్షలకు పెరగనుంది.

3-Buss.jpg


అప్‌డేటెడ్‌ ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు మరింత సమయం: ఇకపై అప్‌డేటెడ్‌ ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు 48 నెలల (4 ఏళ్ల) వరకు గడువు లభించనుంది. ప్రస్తుతం ఇది 12 నెలలు (ఏడాది)గా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏ కారణంగానైనా రిటర్ను సమర్పించలేకపోయినట్లయితే, దాన్ని అప్‌డేట్‌ చేసేందుకు నాలుగేళ్ల వెసులుబాటు లభించనుంది.

ఇవి కూడా చదవండి:

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..

Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..

New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:28 AM