Share News

Srisailam: శ్రీగిరిలో వైభవంగా ప్రభోత్సవం

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:28 AM

ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో మూడో రోజు ప్రభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను నంది వాహనంపై ఊరేగించి భక్తులకు దర్శనం కలిగించారు.

Srisailam: శ్రీగిరిలో వైభవంగా ప్రభోత్సవం

శ్రీశైలం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్ర రథవీధిలో అశేష భక్తజనం మధ్య స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుగంధ పుష్పాలు, పరిమళ ద్రవ్యాలతో అలంకరించిన ప్రభపై ఆదిదేవులను కోలాహలంగా ఊరేగించారు. అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నంది వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వగా,మహా సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. పురవీధుల్లో అశేష భక్తజనం నడుమ గ్రామోత్సవం నిర్వహించారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:28 AM