Share News

Wakf Amendment Bill: వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:31 AM

వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణకు దారితీసే వక్ఫ్‌ సవరణ బిల్లు 2024 రాజ్యాంగ విరుద్ధమని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు ఖాలిద్‌ సైఫుల్లా రెహమాని తెలిపారు. విజయవాడలో మహాధర్నా నిర్వహించిన సందర్భంగా, 50 మిలియన్ల ముస్లింలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటరీ సంఘానికి ఈమెయిల్స్ పంపారని ఆయన వెల్లడించారు.

Wakf Amendment Bill: వక్ఫ్‌ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం

బిల్లును త్రీవంగా వ్యతిరేకిస్తున్నాం:ముస్లిం నేతలు

విజయవాడ(ధర్నాచౌక్‌), మార్చి 29(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ ఆస్తులను ఆక్రమించేందుకు రూపొందించిన వక్ఫ్‌ సవరణ బిల్లు 2024 రాజ్యాంగ విరుద్ధమని, ఈ బిల్లును అడ్డుకోవాలని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు ఖాలిద్‌ సైపుల్లా రెహమాని పిలుపునిచ్చారు. ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆధ్వర్యంలో విజయవాడ ఽధర్నాచౌక్‌లో శనివారం మహాధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా 50 మిలియన్లకు పైగా ముస్లింలు పార్లమెంటరీ సంఘానికి (జేపీసీ)కు ఈ మెయిల్స్‌ పంపామని తెలిపారు. అఖిల భారత ముస్లిం వ్యక్తిగత చట్ట మండలి ఇతర జాతీయ, రాష్ట్రస్థాయి ముస్లిం సంస్ధలతో నాయకులతో కలిసి ఈ బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిందని చెప్పారు. ముస్లిం సమాజంతో ఎటువంటి సప్రందింపులు లేకుండా వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ధ్వజమెత్తారు. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఫజ్లుర్‌ రహిమ్‌ ముజద్దీద్‌ మాట్లాడుతూ వక్ఫ్‌ పరిరక్షణ ముస్లింల విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. ఈ బిల్లు వల్ల కలిగే నష్టాలను సీఎం చంద్రబాబుకు వివరిస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:31 AM