Share News

AP Elections 2024: నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్: యనమల రామకృష్ణుడు

ABN , Publish Date - May 01 , 2024 | 09:51 PM

నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. రెడ్డిగూడెం గ్రామంలో కూటమి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు.

 AP Elections 2024: నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్: యనమల రామకృష్ణుడు
Yanamala Ramakrishna

ఎన్టీఆర్ జిల్లా - రెడ్డిగూడెం: నవరత్నాలు పేరుతో నవ మోసాలు చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishna) ఆరోపించారు. రెడ్డిగూడెం గ్రామంలో కూటమి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెంలో కూటమి శ్రేణులు భారీ బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ...నియోజకవర్గానికి వసంత కృష్ణప్రసాద్ నాయకత్వం అవసరమని తెలిపారు. నియోజకవర్గానికి న్యాయం జరగలేదనే బాధతో మీ పక్షాన ఆయన నిలబడ్డారని చెప్పారు.


Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..

నియోజకవర్గ ప్రజల స్పందన వసంత కృష్ణప్రసాద్ గెలుపుతో పాటు రాష్ట్రంలో కూటమి విజయానికి సంకేతమని వివరించారు. చింతలపూడి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని ఉద్ఘాటించారు.మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీల పథకాలను జగన్ రద్దు చేశారన్నారు. అన్న క్యాంటీన్లను రద్దు చేశారని చెప్పారు. ఏపీలో అత్యంత నిరుపేద జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ఉన్న ప్యాలస్ చాలక విశాఖపట్నంలో ప్రజాధనంతో మరో ప్యాలస్ కట్టుకున్నారని విమర్శించారు.ఎస్సీ, బీసీ, మైనార్టీల పథకాలును ఎందుకు తీసివేశాడో జగన్‌ను ప్రశ్నించాలన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వసంత కృష్ణప్రసాద్‌ని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు.


మూడు రాజధానుల పేరుతో క్రొత్త డ్రామా: వసంత కృష్ణప్రసాద్

మూడు రాజధానుల పేరుతో క్రొత్త డ్రామాకి జగన్మోహన్ రెడ్డి తెరతీశారని మైలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ (Vasantha Krishna Prasad) మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ లేకుండా పరిపాలన సరికాదని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి మీ ఆశీస్సులు కావాలని వసంత కృష్ణప్రసాద్ అభ్యర్థించారు.


Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 10:03 PM