Home » Telangana » Adilabad
జిల్లాలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. భక్తులు శుక్రవారం ఉదయం నదీ స్నానాలు ఆచరించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలు, దీపదానాలు చేశారు. గూడెం గుట్టపై నిర్వహించిన మహా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో నిండింది. పలు ఆలయాలను భక్తులు సందర్శించారు.
ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి దిశగా ధర్తీ అబ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మోతిలాల్, నోడల్ అధికారి సీతారాం, డీఎంహెచ్‌వో హరీష్ రాజ్‌లతో కలిసి హాజరయ్యారు.
కేంద్ర ప్రభు త్వం భగవాన్ బీర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి ధర్తీ అబ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన సంచార మెడికల్ యూనిట్‌ను ప్రారంభించామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.
ఈనెల28న సింగరేణి డైరెక్టర్‌తో జరిగే స్ట్రక్చర్ సమావేశంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్రఅధ్యక్షుడు వి సీతా రామయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె రాజ్ కుమార్ అన్నారు. నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో వారిద్దరు విలేకరులతో మాట్లా డారు.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసే కుట్రలకు పాల్పడుతోందని అఖిలపక్షం నాయకులు సంకె రవి, పార్వతి రాజిరెడ్డి, దూలం శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం సీఈఆర్ క్లబ్లో బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
కాగజ్‌నగర్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): సర్పంచ్, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. మరో 76 రోజులు గడిస్తే మున్సిపల్ పాలకవర్గం గడువు కూడా ముగియనుంది.
ఆసిఫాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 17,18 తేదీల్లో నిర్వహించే గ్రూపు-3పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించామని ఎస్పీ డీవీశ్రీనివాసరావు అన్నారు.
ఆసిఫాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): బీర్సా ముండా స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకుసాగాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లో శుక్రవారం కార్తీకపౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఆసిఫాబాద్ రూరల్, నవం బరు 15(ఆంధ్రజ్యోతి): ఒక్క ఉద్యోగం సాధించానికే చాలా కష్టమవుతున్న ఈ రోజుల్లో మూడు ప్రభుత్వఉద్యోగాలు సాధించి తన ప్రతిభను చాటు కున్నాడు పట్టణానికి చెందిన పుల్లూరి రాహుల్.