డాక్టర్ త్రివేణికి మహర్షి బాదరాయణ వ్యాస్ సమ్మాన్ పురస్కారం
ABN , First Publish Date - 2020-12-09T05:04:58+05:30 IST
తెలంగాణ విశ్వ విద్యాలయంలోని తెలుగు అధ్యాయణ శాఖకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంగరి త్రివేణికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి యువప్రోత్సాహక పురస్కారం మహర్షి బాదరా యణ వ్యాస్ సమ్మాన్ 2019కు ఎంపికైన విష యం విధితమే.

డిచ్‌పల్లి, డిసెంబరు 8: తెలంగాణ విశ్వ విద్యాలయంలోని తెలుగు అధ్యాయణ శాఖకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంగరి త్రివేణికి అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి యువప్రోత్సాహక పురస్కారం మహర్షి బాదరా యణ వ్యాస్ సమ్మాన్ 2019కు ఎంపికైన విష యం విధితమే. కాగా ఈ సంవత్సరం మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లిలోని రాష్ట్రపతి భవ న్‌లో రాష్ట్ర పతి చేతుల మీదుగా ఈ పురస్కా రం పొందాల్సి ఉండగా కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలను అనుసరించి తేదీల్లో మా ర్పు జరిగింది. ఇదిలా ఉండగా పురస్కార నగ దు రూ.లక్ష డాక్టర్ వంగర త్రివేణి బ్యాంక్ అ కౌంట్‌కు పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా 2021 ఆర్థిక సంవత్సరం నుంచి ఒకేసారి మానిటరీ గ్రాంట్ తర్జుమా చేసినట్లు రాష్ట్రీయ సంస్కృత సమ్మాన్ న్యూ ఢిల్లీ నుంచి ఎకానర్జ్ రిసిప్ట్ లేటర్ మంగళవారం ఉదయం అందిందని తెలిపారు. ఈ నగదు క్రెడిట్ లెట ర్‌ను రిజిస్ట్రార్ ఆచార్య నసీం చేతుల మీదుగా త్రివేణి అందుకున్నారు. త్వరలో ఢిల్లీలో రా ష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల ద్వారా మహ ర్షి బాదరాయణ అవార్డును, గౌరవ పురస్కారం, ప్రశంసాపత్రం పొందనున్నారు. ఈ సందర్భం గా త్రివేణిని వీసీ నీతూ కుమారీ ప్రసాద్, రిజి స్ర్టార్ నసీంలు, పరిశోధక విద్యార్థులు, అధ్యా పకులు ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యం గా ఈ నగదును ఆధ్యాత్మిక, తాత్విక, చింతనా త్మక గ్రంథాల ప్రచురణకు వినియోగించనున్న ట్లు త్రివేణి తెలిపారు.