ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్ట్..
ABN , First Publish Date - 2021-01-23T18:01:56+05:30 IST
కడప: ప్రొద్దుటూరులో నిన్న యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్టు అయ్యాడు.

కడప: ప్రొద్దుటూరులో నిన్న యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది సునీల్ కుమార్ అరెస్టు అయ్యాడు. ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ ప్రసాద రావు తెలిపారు. ఇంకా ఎవరి ప్రమేయం ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామని డీఎస్పీ తెలిపారు.
అసలేం జరిగిందంటే...
ప్రొద్దుటూరు పట్టణం నేతాజీనగర్‌కు చెందిన లావణ్య(17) ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బీటెక్‌లో చేరే ప్రయత్నంలో ఉంది. అయితే, స్థానిక స్వరాజ్‌నగర్‌కు చెందిన సునీల్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ మూడు నెలలుగా వేధిస్తున్నాడు. లావణ్య ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం లావణ్య తల్లిదండ్రులు శ్రీనివాసులు, భారతి ఇంటి నుంచి బయటికి వచ్చిన విషయం తెలుసుకున్న సునీల్.. 11.45 గంటల సమయంలో టెంకాయలు కొట్టే మచ్చుకత్తితో ఇంట్లోకి జొరబడి ఒంటరిగా ఉన్న లావణ్య తల, చేతులపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ లావణ్య కేకలు వేయడంతో సునీల్ పరారయ్యాడు. గాయపడిన లావణ్యను తల్లిదండ్రులు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. వన్‌టౌన్ సీఐ నాగరాజు, ఎస్ఐ శివశంకర్‌లు సిబ్బందితో చేరుకుని ఘటన తీరును తెలుసుకున్నారు. లావణ్య పరిస్థితి విషమంగా ఉండటంలో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌లో చేర్పించారు.